‘సాహో’ వాయిదా పడటం అనేకమంది హీరోల యాక్షన్ ప్లాన్ కు అడ్డుగా మారడంతో బయటకు చెప్పలేకపోయినా కొంతమంది హీరోలు ప్రభాస్ తీరు పై తెగ మధన పడుతున్నట్లు టాక్. ముఖ్యంగా ఈ లిస్టులో ప్రధమ స్థానంలో నాని వరుణ్ తేజ్ లు ఉన్నారు.

‘సాహో’ ఆగష్టు 15న విడుదల అవుతుంది అన్న ఉద్దేశ్యంతో నాని తన ‘గ్యాంగ్ లీడర్’ మూవీకి ఆగష్టు 30న ముహూర్తం పెట్టుకున్నాడు. అదేవిధంగా మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ తన ‘వాల్మీకి’ ని సెప్టెంబర్ 6 వినాయకచావితిని టార్గెట్ చేస్తూ విడుదల చేయాలని ఈమూవీని చాల వేగంగా పూర్తి చేసాడు. 

ఇప్పుడు ప్రభాస్ ‘సాహో’ ఆగష్టు 30కి వెళ్ళడంతో ఇప్పుడు నాని వరుణ్ తేజ్ లు తమ యాక్షన్ ప్లాన్ ను మార్చుకోవలసిన పరిస్థితి. అనుకున్న విధంగా ‘సాహో’సునామీలు సృష్టిస్తే ఈమూవీ హడావిడి కనీసం మూడు వారాలకు పైగా ఉంటుంది. ఆతరువాత సెప్టెంబర్ మూడు నాలుగు వారాలలో నాని వరుణ్ తేజ్ లు రావాలని ప్రయత్నించినా అక్టోబర్ 2న చిరంజీవి ‘సైరా’ దూసుకు వస్తోంది. 

ఆ తరువాత దసరా రోజులలో ‘వెంకీ మామ’ రాబోతోంది దీనితో నాని వరుణ్ తేజ్ లకు వారి సినిమాలకు సంబంధించి అక్టోబర్ మూడవ వారం వరకు  ఖాళీ లేని పరిస్థితి. దీనికితోడు కొన్ని చిన్న సినిమాలు కూడ ఆగష్టు 30 సెప్టెంబర్ మొదటి వారంలో రావాలని అనుకున్న ప్రయత్నాలు అన్నీ ‘సాహో’ విడుదల వాయిదా పడటంతో చాల సినిమాల యాక్షన్ ప్లాన్స్ మారిపోతున్నాయి. దీనితో ‘సాహో’ విడుదల కాకుండానే ప్రభాస్ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి శత్రువుగా మారాడా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: