యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువి క్రియేషన్స్ బ్యానర్ పై యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ భారీ ప్రాజెక్టు సాహో. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ తొలిసారి టాలీవుడ్ కు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా విపరీతమైన అంచనాలున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల వీక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మరియు ఒక సాంగ్ తో ఆ అంచనాలు మరింతగా పెరిగాయని చెప్పాలి. ఇకపోతే మొదట ఈ సినిమాను స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు సాహో టీం, టీజర్ విడుదల టైం లో ప్రకటన విడుదల చేసింది. 

అయితే మూడు రోజుల క్రితం సడన్ గా, తమ సినిమాకు అన్ని విభాగాల్లో క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాబోమని, కాబట్టి అందునిమిత్తం కొంత జాప్యం కావడం కారణంగా సినిమా విడుదలను మరొక పదిహేనురోజులు వాయిదా వేసి తమ సినిమాను ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించడం జరిగింది. నిజానికి ఇదే విడుదల తేదీని నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రస్తుతం రూపొందుతున్న గ్యాంగ్ లీడర్ సినిమా యూనిట్ తమ సినిమా కోసం ఫిక్స్ చేసింది. అయితే ఇప్పుడు హఠాత్తుగా సాహో నిర్మాతలు అదేరోజున తమ సినిమా విడుదలను ప్రకటించడంతో గ్యాంగ్ లీడర్ సినిమా యూనిట్ కొంత ఆలోచనలో పడ్డారట. నిజానికి ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాల్లో సాహో కొంత ప్రత్యేకమని చెప్పాలి. ఎందుకంటే బాహుబలి రెండు భాగాల సూపర్ డూపర్ సక్సెస్ ల తరువాత ప్రభాస్ నటిస్తున్న మూవీ కావడం, అదీకాక దాదాపుగా ఐదేళ్ల తరువాత ప్రభాస్ ఫుల్ లెంగ్త్ సోషల్ మూవీలో నటిస్తుండడం, అంతకంటే ముఖ్యంగా ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజిలో రూపొందుతూ ఉండడం. 

మరి ఇన్ని ప్రత్యేకతలున్న ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడమే కాక దానికి వచ్చే ఓపెనింగ్స్ కూడా భారీ స్థాయిలోనే ఉంటాయని చెప్పవచ్చు. ఇక సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా, ఆ కలెక్షన్ల దూకుడుకు ఇక అడ్డుకట్ట పడడం అసాధ్యం. మరి ఇంత క్లిష్ట పరిస్థితుల్లో తమ సినిమాను విడుదల చేయాలా వద్దా అనేది గ్యాంగ్ లీడర్ టీమ్ కు అర్ధం కావడం లేదట. అయితే ఏది ఎలా జరిగినప్పటికీ ముందుగా తాము ప్రకటించిన విధంగానే ఆగష్టు 30న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫైనల్ గా ఫిక్స్ అయిందట గ్యాంగ్ లీడర్ సినిమా యూనిట్. మరి అదే రోజున విడుదల కాబోయే ఈ రెండు సినిమాల్లో ఏది ఎంతటి విజయాన్ని అందుకుంటాడా వేచి చూడాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: