Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Aug 22, 2019 | Last Updated 11:15 pm IST

Menu &Sections

Search

'రణరంగం' లోని 'కన్నుకొట్టి' సాంగ్ రిలీజ్!

'రణరంగం' లోని 'కన్నుకొట్టి'  సాంగ్ రిలీజ్!
'రణరంగం' లోని 'కన్నుకొట్టి' సాంగ్ రిలీజ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం    'రణరంగం' ఆగస్టు 15 న విడుదల కానున్న విషయం విదితమే.ఈ చిత్రానికి సంబంధించిన రెండవ  పాటను ఈ రోజు విడుదల చేశారు.

'కన్ను కొట్టి చూసేనంట సుందరి...మనసు మీటి వెళ్లే నంట మనోహరి' అనే పల్లవి గల ఈ  గీతాన్ని గీత రచయిత కృష్ణ చైతన్య రచించగా, చిత్ర సంగీత దర్శకుడు కార్తీక్ రాడ్రి గ్రూజ్ ఆలపించారు. కథానాయకుడు శర్వానంద్, కల్యాణి ప్రియదర్శిని లపై ఈ గీతాన్ని చిత్రీకరించారు. కధా పరంగా శర్వానంద్, ప్రియదర్శిని ల మధ్య ఉన్న ప్రేమ కు చక్కని వెండితెర రూపం ఈ పాట. కా

ర్తీక్ గళం ఈ పాటకు మరింత కొత్త ధనాన్ని అందించింది. ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుదల అవుతుంది. చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రాన్ని  ఆగస్టు 15 , 2019   న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు

 ఈ చిత్రానికి మాటలు: అర్జున్ - కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం :దివాకర్ మణి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య,ఎడిటర్: నవీన్ నూలి,  ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, పోరాటాలు:వెంకట్, నృత్యాలు: బృంద, శోభి,శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్: సి.హెచ్. రామకృష్ణారెడ్డి,  సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.నిర్మాత: సూర్యదేవర నాగవంశీ రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ   



ranarangam-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.