ముందుగా అనుకున్న డేట్ ప్రకారం సాహో ఆగష్ట్ 15న విడుదల కావాలి. సాహో సినిమా ఆగష్ట్ 15న విడుదలయి ఉంటే ఎవరికీ ఏ సమస్య వచ్చేది కాదు. కానీ ఆ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడటంతో కొన్ని సినిమాలు లాభపడుతుంటే మరికొన్ని సినిమాలు మాత్రం భారీగా నష్టపోతున్నాయి. సాహో సినిమా వాయిదా పడటం వలన నాగార్జున మన్మధుడు2, అడవిశేష్ ఎవరు, శర్వానంద్ రణరంగం సినిమాలకు మేలు చేకూరుతుంది. 
 
ఇదే సమయంలో సాహో సినిమా వలన నాని గ్యాంగ్ లీడర్ సినిమాకు, వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాకు నష్టం కలుగుతోంది. గ్యాంగ్ లీడర్ సినిమాను ఆగష్ట్ 30న విడుదల చేద్దామనుకున్నారు గ్యాంగ్ లీడర్ చిత్ర నిర్మాతలు. కానీ ఇప్పుడు సాహో ఆగష్ట్ 30 డేట్ ఫిక్స్ చేసుకోవటంతో గ్యాంగ్ లీడర్ సినిమా సెప్టెంబర్ 13న తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారట ఈ చిత్ర నిర్మాతలు. వాల్మీకి చిత్ర యూనిట్ వాల్మీకి సినిమాను సెప్టెంబర్ 6న విడుదల చేయాలనుకుంది 
 
ఇప్పుడు సాహో సినిమా ఆగష్ట్ 30న రాబోతూ ఉండటంతో వాల్మీకి సినిమాకు సరైన డేట్ దొరకట్లేదు. సాహో, గ్యాంగ్ లీడర్, సైరా లాంటి పెద్ద సినిమాలు వరుసగా ఉండటంతో థియేటర్లు దొరకటం కూడా అంత తేలిక కాదు. ఏ డేట్ దొరక్కపోతే అక్టోబర్ కు వెళ్ళాల్సిన పరిస్థితి. వాల్మీకి సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా పూజా హెగ్డే ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. తమిళంలో హిట్టైన జిగర్తాండ సినిమాను తెలుగులో వాల్మీకి పేరుతో రీమేక్ చేస్తున్నారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: