డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దాదాపు తొంబై శాతం తన సినిమాలను సొంత కథలతో తెరకెక్కిస్తాడన్న సంగతి తెలిసిందే. హీరో ని ఎలివేట్ చేయడంలో గానీ యాక్షన్ సీన్స్ ని తెరపై ఆవిష్కరించడంలో గానీ హీరోయిన్స్ ని గ్లామరస్ గా ప్రజెంట్ చేయడంలో గానీ పూరీ స్టైల్ మరే దర్శకుడికి రాదు. అతి కొద్ది కాలంలోనే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్న పూరీ ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ని ఇచ్చాడు. అంతేకాదు ఒక డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఎవరు సంపాదించలేనంత క్రేజ్ ని డబ్బును సంపాదించారు. అయితే వీటితో పాటు ఒకే రకమైన కథ, స్క్రీన్ ప్లే తో సినిమాలను తెరకెక్కించి డిజాస్టర్స్ ను ఇచ్చాడు. 

గత కొంతకాలంగా పూరీ జర్నీ ఇలానే కొనసాగుతూ వస్తుంది. దాంతో పూరీకి డేట్స్ ఇవ్వడానికి హీరోలు గానీ, అలాగే పూరీతో సినిమా నిర్మించడానికి నిర్మాతలుగాని కరువైయ్యారు. అందుకే హీరోయిన్ ఛార్మీ భాగస్వామ్యంతో పూరీనే నిర్మాతగా వరుస ఫ్లాపుల్లో ఉన్న రామ్ ని హీరోగా, నిధీ అగర్వాల్. నభా నటేష్ లను హీరోయిన్స్ గా పెట్టి ఇస్మార్ట్ శంకర్ ని తెరకెక్కించాడు. ఈ సినిమా హిట్ అందరికి ఎంతో కీలకంగా మారింది. అనుకున్నట్టుగానే ఇస్మార్ట్ శంకర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. యూనిట్ మొత్తానికి ఒక సక్సస్ ని ఇచ్చింది. కంప్లీట్ మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి రూపొందించిన ఈ సినిమా మొదటి రెండు రోజుల్లోనే భారీ కలెక్షన్స్ ని రాబట్టింది. రామ్ డైలాగ్ డెలవరీ కాస్త ఇబ్బందిగా అనిపించనా కూడా అదేమంత పెద్ద సమస్యగా అనిపించకపోవడంతో సినిమా బాగా రన్నవుతోంది. 

అయితే ఈ సినిమాకు ఇస్మార్ట్ గా హిట్ టాక్ అయితే వచ్చింది గానీ అది పూరీకి కొంత మైనస్ గానే చెపుతున్నారు ప్రేక్షకులు. అందుకు కారణం పూరీ తన స్టైల్ ని ఏమాత్రం వదలకుండా ఒక్క మేయిన్ పాయింట్ తప్ప మిగతా సినిమా అంతా తన గత సినిమాల మాదిరిగానే ఉందనే విమర్శ వచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ఎంతో ప్లస్ అయిందని తెలుస్తోంది. పూరీ హిట్ అయితే కొట్టాడు కానీ తన మేకింగ్ లో కొత్తదనమేమి లేదని ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. అయితే ఏదో కిందా  మీదా పడి ఓ హిట్ ఇచ్చాడుగా...అయినా ఈ విమర్శలేంటి అని కొంతమంది పూరీకి సపోర్ట్ చేస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: