నీతోడు కావాలి సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైన ఛార్మీ కౌర్ శ్రీ ఆంజనేయం, చంటి, చక్రం, అనుకోకుండా ఒకరోజు, మంత్ర, రాఖీ, పౌర్ణమి,..ఇలా చాలా సినిమాలలో హీరోయిన్ గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తను హీరోయిన్ గా నటించిన ఆఖరి సినిమా జ్యోతి లక్ష్మి. ఈ సినిమాను ఒక నవల ఆధారంగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించాడు. ఈ సినిమాకు గాను ఛార్మీకి ఉత్తమనటిగా అవార్డ్ ను దక్కించుకుంది. ఆ తర్వాత కంప్లీట్ గా సినిమాలకు హీరోయిన్ గా దూరమైంది. కానీ పూరీ తో కలిసి నిర్మాతగా కొనసాగుతోంది. ఇక తను సహ నిర్మాతగా తెరకెక్కించిన రోగ్, పైసా వసూల్, మెహబూబా ప్రేక్షకులను ఆకట్టుకులేక ఫ్లాప్ ను చూశాయి. అయినా ఛార్మీ ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటూనే ఇస్మార్ట్ శంకర్ కి సహ నిర్మాతగా వ్యవహరించింది. రీసెంట్‌గా రిలీజైన ఈ సినిమా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. 

అయితే ఈ సక్సస్ లో ఛార్మీ క్రెడిట్ ఎంతుందీ అని జనాలు చెప్పుకుంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఛార్మీ ఈ సినిమాకోసం ఆఫ్ స్క్రీన్ చాలా కష్ట పడిందట. అన్నీ విషయాలను ఎంతో ఓపిగ్గా దగ్గరుండి చూసుకుందని సమాచారం. నిర్మతగా కాకుండా యూనిట్ లో ఒక మెంబర్ గా అందరిని కలుపుకుపోయి కావల్సిన సమయానికి అన్నీ అరేంజ్ చేసిందట. ఇంకా చెప్పాలంటే ఇస్మార్ట్ శంకర్ సక్సస్ లో ఛార్మీ కి చాలా క్రెడిట్ ఇవ్వాల్సిందేనని చెప్పుకుంటున్నారు. గత కొంతకాలంగా పూరీకి సరైన హిట్ లేక సతమతమవుతున్న సమయంలో పూరీకి ఛార్మి సపోర్ట్ బాగా దొరికింది. రామ్ కి కూడా హిట్ లేక చాలా కాలమే అయింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా హిట్ యూనిట్ అందరికీ ఎంతో కీలకంగా మారింది. అయితే చాలామందికి ఈ సినిమా మీద నమ్మకం లేదనే చెప్పాలి. 

ఒక దశలో దిల్ రాజు సైతం సినిమాను కనీసం చూడటానికి కూడా సమయమివ్వలేదని ఫిల్మ్ నగర్ సమాచారం. మెహబూబా ఫ్లాప్ అవడంతో దిల్ రాజు ఇస్మార్ట్ శంకర్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయనని పూరీకి నిర్మొహమాటంగా చెప్పడంతో ఇతర డిస్ట్రిబ్యూటర్లతో సినిమాను రిలీజ్ చేశారు. పక్కా మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ కిర్రాక్ ఉందని మొదటి షో నుండే ప్రేక్షకులు ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పటికే అద్భుతమైన కలెక్షన్ల తో ఇస్మార్ట్ శంకర్ దూసుకుపోతోంది. ఈ సక్సస్ యూనిట్ అందరిది అని రీసెంట్‌గా పెద్ద పార్టీ కూడా చేసుకున్నారు. ఇక ఈ నేపథ్యం లో పూరీ నెక్స్ట్ మూవీ ఎవరితో ఉండబోతోందని అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో అప్పుడే మొదలైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: