రామ్ గోపాల్ వర్మ సినిమాలు వస్తున్నాయి అంటే జనాలు రెడీగా ఉంటారు.  సినిమా ఎలా ఉంటుంది అని బెట్టింగులు వేసుకుంటూ ఉంటారు.  వాళ్లకు తప్పకుండా తెలుసు సినిమా పెద్దగా ఏమి ఉండదు అని.  కానీ, క్రేజ్ మాత్రం ఉంటుంది.  అదే ఆయన్ను ఇంకా ఇండస్ట్రీలో ఉంచింది.  


వర్మ శిష్యుడు పూరికి కూడా ఇదే క్రేజ్ ఉన్నది.  ఆయన్ను దర్శకుడిగా ఇంకా ఇండస్ట్రీ నిలబెడుతూనే ఉన్నది.  కెరీర్లో హిట్స్ ఎన్ని ఉన్నాయో అంతకంటే ఎక్కువ ప్లాప్ లు ఉన్నాయి.  స్టార్టింగ్ లో ఎన్నో హిట్స్ ఇచ్చాడు.  తరువాతే అన్ని ప్లాప్ లు ఇచ్చుకుంటూ వచ్చాడు.  


ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ రూపంలో మంచి హిట్ దొరికింది.  దీనిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.  పూరి కంటే ఆయన గురువు వర్మ ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.  శిష్యులు విజయం సాధిస్తేగురువు కంటే ఆనందించే వ్యక్తి ఇంకెవరు ఉంటారు చెప్పండి.  


ఇప్పుడు ఇక్కడ అదే జరిగింది.  ఇస్మార్ట్ శంకర్ విజయాన్ని షాంపైన్ తో ఎంజాయ్ చేశారు.  కౌగిలింతలలో తడిసి ముద్దయ్యారు.  యూనిట్ లో మధ్యలో వర్మ చేసిన హంగామా చూస్తే బాబోయ్ ఏంటి ఈ రచ్చ అనుకోకుండా ఉండలేరు.  పూరి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు సరే వర్మ ఈ రేంజ్ లో ఎప్పుడు సక్సెస్ ఇస్తారో మరి.  


మరింత సమాచారం తెలుసుకోండి: