సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల మనుగడ కొంతకాలమే ఉంటుంది.  ఆ తరువాత హవా తగ్గిపోతుంది.  అందుకే హీరోయిన్లు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడనికి ప్రయత్నం చేస్తుంటారు.  వీలైనంతగా సంపాదించుకొని లైఫ్లో సెటిల్ కావాలని అనుకుంటారు.  


కొంతమంది హీరోయిన్లు మరో అడుగు ముందుకేసి సెకండ్ ఇన్నింగ్ అంటూ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అదృష్టం పరీక్షించుకుంటుంటారు.  అలాంటి హీరోయిన్లలో నయనతార ఒకరు. నయన్ తెలుగులో చంద్రముఖి సినిమాతో పరిచయం అయ్యింది.  ఆ తరువాత తమిళ తెలుగు సినిమా రంగంలో టాప్ హీరోలందరితో సినిమాను చేసి మెప్పించింది.  


బాలకృష్ణతో చేసిన శ్రీరామా రాజ్యం తరువాత సినిమాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది.  మరేమయిందో తెలియదు.. కొన్నాళ్ల తరువాత తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది.  సెకండ్ ఇన్నింగ్స్ అదరగొట్టింది.  ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలతో అదరగొట్టింది.  


ఇప్పటికి తమిళ సినిమా ఇండస్ట్రీలో హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా చలామణి అవుతున్నది.  సినిమా ఏదైనా కావొచ్చు.. ఒక్కో సినిమాకు ఐదు కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తున్నది.  దీనికి ఇతర సౌకర్యాలు అదనం.  ఫేమ్ లో ఉన్నది కాబట్టి ఆమె అడిగినంత ఇచ్చేందుకు.. అడిగిన సౌకర్యాలు కల్పించేందుకు నిర్మాతలు సైతం సిద్ధంగా ఉన్నారు.  మరో రెండేళ్లపాటు ఖాళీ లేనంత బిజీగా మారిపోయింది నయనతార.  


మరింత సమాచారం తెలుసుకోండి: