అలితో సరదాగా కార్యక్రమంలో‌   డైరెక్టర్ తేజా తాను ఎలా కెమెరామెన్ నుండి డైరెక్టర్ అయ్యారో చెప్పారు. శివ తరువాత చాలమంది ఆర్జీవి డేట్లు దొరకకపోతే తేజా ఉన్నాడు తేజా డేట్లు అడగండి అని అడిగేవారు కాని నాకు అది చేతకాదు అని చెప్పేవాడిని. బాంబేలో చెస్తున్నప్పుడు ఒక సినిమా చెస్తున్నప్పుడు ఒక డైరెక్టర్ అన్ని వదిలెసి నన్ను తీసెయ్ మని చెప్పి వెళ్లేవారు అలా ఒక సినిమా పది రొజులు నేనే తీశాను, అది పెద్ద హిట్ అయ్యింది.



అప్పుడు నాకు 8 లక్షలు ఇచ్చేవారు సినిమా అయ్యాక 9 లక్షలు ఇచ్చారు. ఆ డైరెక్టర్ కి  ఆ సినిమాకి 1 లక్ష ఇచ్చారు ఆ సినిమా తరువాత 40 లక్షలు ఇచ్చారు. నాకేమో లక్ష పెంచారు తనకేమో లక్షలు పెంచారు అది చూసి డైరెక్షన్ బెటర్ అని అ షిఫ్ట్ అయ్యాను అని చెప్పారు



అప్పట్లో సినిమాలన్నీ హైద్రాబాద్ కి షిఫ్ట్ చేసేవాడిని రామోజీ ఫిలిమ్ సిటీ లోకి ఎందుకంటే అప్పుడప్పుడు  ఇంటి కి వెళ్లొచ్చు అని ఒక ఉద్దేశంతో. అలా ఒక రోజు రమోజీరావ్ గారిని కలిసి నా దెగ్గర కథ ఉంది అని ఆయనకు  చెప్పాను.



ఆయన ఆ కథను సగం దాకా విన్న తర్వాత మీ ట్రాక్ రికార్డు చూశాను మీ కథ  నాకు బాగా నచ్చింది మీరు ఆ సినిమా చెయ్యండి  అని చెప్పారు ఆ సినిమా  నా మొదటి సినిమా 'చిత్రం'. అని తను డైరెక్టర్ ఎలా అయ్యారో తేజా చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: