'నా పేరు సూర్య' సినిమా దారుణంగా ఫ్లాప్ అవడంతో  చాలా పెద్ద గ్యాప్ తీసుకొని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లో పని చేస్తున్నాడు అల్లు అర్జున్. వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేసుకుని షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా లో అల్లు అర్జున్ సాఫ్ట్ వేర్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఇదిలావుండగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది మరోపక్క డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్' అనే సినిమా ఒప్పుకున్న అల్లు అర్జున్ లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో కూడా మరో ప్రాజెక్టు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.


ఇటువంటి క్రమంలో తాజాగా టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి తో కూడా ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఓ సినిమా వస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినపడ్డాయి. ఇటువంటి తరుణంలో తాజాగా ఆ ప్రాజెక్టు పట్టలేక పోతున్నట్లు...ఇప్పటికే స్టోరీ డిస్కషన్ మెగా నిర్మాత అల్లు అరవింద్ తో బోయపాటి చేసినట్లు వార్తలు రావటంతో..ఒక్కసారిగా ఈ వార్త విని బన్నీ ఒక్కసారి ఆలోచించు అంటూ మెగా అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు.


గతంలో బన్నీకి సరైనోడు వంటి భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చినా కానీ..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి వినయ విధేయత రామా వంటి దారుణమైన ఫ్లాప్ బోయపాటి ఇవ్వడంతో...ఈ ప్రాజెక్టు పై మెగా అభిమానులు అల్లు అర్జున్ కి సలహాలు ఇచ్చే ప్రయత్నాలు సోషల్ మీడియాలో చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: