పూరి జగన్నాధ్ కు ఎన్ని ఫ్లాపులు వచ్చినా ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ ఓ అంచనాలు ఉంటాయి. ఓ దశలో పూరితో సినిమా చేయాలని ప్రతి హీరో ఆశపడేంత రేంజ్ కి వెళ్లిపోయాడు. ఎంతగా అంటే బిజినెస్ మ్యాన్ కథను మహేశ్ పూర్తిగా వినకుండా పూరీపై నమ్మకంతో షూటింగ్ కు వెళ్లిపోయేంత. కానీ అదే మహేశ్, పూరీకి అవకాశం ఇవ్వటం లేదు. 

 

 

జనగణమణ మహేశ్ తో తీస్తున్నానంటూ పూరి అనౌన్స్ చేసినా మహేశ్ చాన్స్ ఇవ్వలేదు. కారణం.. పూరీ వరుస ఫ్లాపులివ్వటమే. తాజా ఇంటర్వూలో.. మహేశ్ హిట్లిచ్చే డైరక్టర్ తో మాత్రమే సినిమాలు చేస్తాడని చెప్పి సంచలనం రేపాడు. పూరీ చెప్పినదాంట్లో కొంత నిజం ఉంది. సుకుమార్ తో సినిమా ఒకే చేసి ఎఫ్ 2తో హిట్ ఇచ్చిన అనిల్ ను లైన్ లో పెట్టేశాడు. “ఈ టైమ్ లో సుకుమార్ కంటే మాస్ హిట్ ఇచ్చిన అనిల్ తోనే బెటర్ అని నేను ఈ కమర్షియల్ సినిమా చేస్తున్నా” అని మహేశే అన్నాడు. చిరంజీవి కూడా పూరి చెప్పిన సబ్జెక్ట్ సగం బాగుందని తరువాత ఏం చెప్పకుండా వినాయక్ తో సినిమా చేశాడు. ఈ రెండు విషయాలు చూస్తే పూరీ బాధపడినట్టే కనిపిస్తుంది. తన టాలెంట్ మీద తనకు నమ్మకం ఉండడంతో సినిమాలు తీస్తూనే ఉన్నాడు. 

 

 

ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ తో తన టైమ్ మళ్లీ స్టార్ట్ అయినట్టే కనిపిస్తోంది. కథ కన్నా టేకింగ్, రామ్ యాక్టింగ్, మణిశర్మ మాయాజాలమే ప్రేక్షకులను ధియేటర్ కు రప్పిస్తున్నాయి. రామ్ ను పూరీ అంత బాగా ఎలివేట్ చేశాడు. ఓదశలో పూరీ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వర్మ సాయంతో అమితాబచ్చన్ హీరోగా మూవీ ఓకే చేయించుకున్నాడు. అదే హిందీలో తీసిన ‘బుడ్డా హోగా తేరా బాప్’. ఈ సినిమా హిట్ తో మళ్లీ తానేంటో నిరూపించుకున్నాడు పూరి. మరి ఇస్మార్ట్ సినిమాతో ఇస్మార్ట్ పూరి అయ్యాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: