కన్వర్సేషన్ విథ్ మిస్టిక్- నాని విథ్ సద్గురు



నేడు సద్గురు తో‌ హీరో‌ నాని ఒక ముఖా ముఖి  లో పాల్గొన్నారు. అందులో‌ తనకు చాలా కాలంగా ఒక ప్రశ్న ఉండేదని దానిని ఇలా అడిగారు.



"నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు వారు నాకు ఇచ్చిన మొదటి జీతం 4000 రూపాయలు. ఆ రోజుల్లో అవన్ని 100 రూపాయల నోట్లు. నేను దానిని నా వెనుక జేబులో ఉంచినప్పుడు అది పెద్దగా తగిలేది, నేను బైక్ మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నేకు అది తెలుస్తూ ఉండేది. ఆ డబ్బుతో నేను చాలా ధనవంతుడిని, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను హైదరాబాద్లో సగం కొనగలననా ఒక భావన ఉండెది. అప్పట్లో ఆ  4000 రూపాయలతో, నేను నిజంగా సంతోషంగా ఉన్నాను అటువంటి  ఆనందం నాకు మళ్ళీ కలగడం నాకు గుర్తులేదు. ఇప్పుడు నేను దాని కంటే 1000 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నాను కాని ఆ ఆనందాన్ని నేను ఎప్పుడూ అనుభవించలేకపోతున్నాను.


నేను శనివారం రాత్రి నా స్నేహితులతో కలిసి సోనీ డాబాకు వెళ్లేవాడిని, సోమవారం నుండి శుక్రవారం వరకు నేను శనివారం కోసం ఎదురు చూసేవాడిని, శనివారం ఉదయం నేను మనోళ్లతో కలుస్తానని ఆనందంగా ఉండేవాడిని. ఇప్పుడు అటువంటి భావన కలగడం లేదు.



ఈ రోజు నేను ఊహించని స్థితికి  వచ్చాను నేను మంచి హీరో అయ్యాను కాని జీవితంలో ఆ ఆనందాన్ని నేను ఇప్పుడూ అనుభవించలేకపోతున్నాను. సక్సెస్  అనేది మనమందరం కోరుకుంటాం విజయం కోసం ఎదురుచూస్తు ఉంటాము, మనమందరం ఏదో ఒక రోజు  విజయవంతం అవుతాము కానీ ఆ విజయం మనకు కొన్ని ఆనందాలను దూరం చెస్తుందా" అని నానీ సద్గురు ని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: