బద్రి, ఇడియట్, అమ్మా నాన్నా ఓ తమిళ అమ్మాయి, బిజినెస్ మ్యాన్...ఈ సినిమాలు సూపర్ హిట్ సినిమాలు. పూరీ వీటిని ఒక్కో డిఫ్రెంట్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కించి సక్సస్ కొట్టాడు. ఇక పోకిరి ఒక బ్లాక్ బస్టర్ హిట్ అండ్ హిస్టరీ ని క్రియోట్ చేసిన సినిమా. ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని మహేష్  బాబు కానీ-పూరీ కానీ అనుకోలేదు. అయితే అప్పటి వరకు ఉన్న అన్నీ రికార్డ్స్ ని ఈ సినిమా బ్రేక్ చేసింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అప్పటి నుండి ఈ కథా నేపథ్యాన్ని పూరి ఎందుకనో వదలడం లేదు. 
ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాలు ఒకే తరహాలో ఉండటంతో జనాలకి పూరీ సినిమాలంటే ఒక దశలో విసుగొచ్చేసింది. అదే హీరో పర్ఫార్మెన్స్, అదే మేకింగ్, అదే తరహా సాంగ్స్..ఇక పూరీ మారరా...అని ఫ్యాన్స్ అయితే చాలా ఫీలయ్యారు. 

మెహబూబా తర్వాత పూరీ పని అయిపోయిందని కూడా ఫిల్మ్ నగర్ లో టాక్ గట్టిగా వినిపించింది. యంగ్ హీరోస్ దగ్గర నుండి, స్టార్ హీరోస్ వరకు అందరు సైలెంట్ అయిపోయారు. పూరీ కథ వినడానికి ఎవరు ఆసక్తి చూపలేదు. ఇస్మార్ట్ శంకర్ కథ ముందు విజయ్ దేవరకొండ తో చేయాలనుకున్నారని ఒక ప్రచారం జరిగింది. అంతేకాదు నితిన్ కూడా పూరీతో మళ్ళీ జత కడుతున్నాడని అన్నారు. కానీ వీటిలో వాస్తవమెంతో తెలీదు గానీ రామ్ తో కలిసి డేట్ కెళ్ళారు పూరీ..ఇద్దరు తమ మైండ్ ని సెట్ చేసుకున్నారు. ఇస్మార్ట్ శంకర్ తో సెట్స్ మీదకు వెళ్ళారు. అయితే ఈ కాంబినేషన్ అనగానే చాలామంది పెదవి విరిచారు...పూరీ కి మైండ్ మొత్తంగా దొబ్బిందని అన్నారు. 

జోగి జోగి రాసుకుంటున్నారు..రేపు బూడిద తప్ప ఇంకేం రాలదని అనుకున్నారు...కానీ ఫస్ట్ లుక్..ఫస్ట్ టీజర్..థియోట్రికల్ ట్రైలర్ చూసిన మాస్ ఆడియన్స్ 'దీనమ్మ కిర్రాక్ ఉంది' అనడం మొదలు పెట్టారు..అంతే ఎప్పటికప్పుడు సాంగ్స్...రిలీజ్ ట్రైలర్స్ తో సినిమాపై భారీగా అంచనాలు పెంచేశారు ఇస్మార్ట్ టీమ్. ఇంకేముంది రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఇస్మార్ట్ శంకర్ కాసుల వర్షం కురిపిస్తోంది. బాక్సులు బద్దలవుతున్నాయి. ఈ కథ లో ఉన్న లైన్ మనది కాదు అన్న కామెంట్స్ వస్తున్నప్పటికి మన భాష, తెలంగాణ యాసతో 'మార్ ముంతా.. ఛోడ్ చింతా' అనిపించాడు పూరి..అంతేకాదు జోగి జోగి రాసుకుంటే బూడిద కాదు కోట్లు రాలతాయ్ అని నిరూపించాడు మన 'ఇస్మార్ట్ పూరి'.


మరింత సమాచారం తెలుసుకోండి: