ఇస్మార్ట్ శంకర్ సినిమా షూటింగ్ సగం అయినప్పటి నుంచే కాపీ కొడుతున్నారన్న వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ఈ మధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలా ఇతర భాషల నుండి కథలనో లేక మేయిన్ లైనో తీసుకొని కథ అల్లేసి సినిమా చుట్టేసి రిలీజ్ చేసేసి హిట్ కొడుతున్నారు. అయితే ఆ తర్వాత ఆ కథ తాలుకు రచయిత గనక ఆధారాలతో రచ్చ చేస్తే ఎంతో కొంతకి బేరమాడి మ్యాటర్ సెటిల్ చేసేసుకుంటున్నారు. అయితే హాలీవుడ్ సినిమాలు చూసి స్ఫూర్తి పొందానని దర్శకుడు పూరి ఇంటర్వ్యూల్లో చెప్పారు. ట్రైలర్ చూశాక.. మెమరీ చిప్ కాన్సెప్టుపై కాపీ అన్న విమర్శలు వస్తున్నాయి కదా? అని ప్రశ్నిస్తే .. ఎన్నో హాలీవుడ్ సినిమాలు చూసి స్ఫూర్తి పొంది తీస్తుంటామని అన్నారు. అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చిప్ .. డబుల్ సిమ్ కాన్సెప్ట్ పక్కాగా హాలీవుడ్ సినిమా ది క్రిమినల్ నుంచి తీసుకున్నదే అన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. 

ఈ సినిమా చూసిన వాళ్లంతా మూడేళ్ల క్రితం హాలీవుడ్ లో రిలీజైన ది క్రిమినల్(2016)తో పోలుస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ లైన్ థ్రెడ్ సేం టు సేం ఆ సినిమానే అంటున్నారు.
ఒకరి మెదడుకి చిప్ ని అమర్చి దాని ద్వారా వేరొకరి జ్ఞాపకాల్ని అతడిలోకి పంపించడం అన్న పాయింట్ తోనే అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్  ది క్రిమినల్ తెరకెక్కించారు. అక్కడ చనిపోయిన సీఐఏ ఏజెంట్ జ్ఞాపకాల్ని  హీరో బుర్రలోకి ఎక్కిస్తారు. ఈ కాన్సెప్ట్ హాలీవుడ్‌లో సూపర్ గా సక్సస్ అయింది. ఇదే కాన్సెప్ట్ ఇక్కడ కాంట్రాక్ట్ కిల్లర్ అయిన శంకర్ బుర్రలోకి చిప్ ని పంపించి వేరొకరి జ్ఞాపకాల్ని ఎక్కించారు. శంకర్ ఇద్దరిలా ప్రవర్తించడం అందులో భాగమే. ఆ రెండు పాత్రల ప్రవర్తన ఒకేలా ఉంటాయి. అయితే ఇక్కడ శంకర్ కి కొన్ని ఎక్స్ ట్రా గా ఊరమాస్ క్వాలిటీస్ ఉన్నాయి. 

రామ్ పాత్రకు పూరి శైలిని జోడించి పూర్తి స్థాయి కమర్షియల్ అంశాలతో మాస్ ఆడియన్స్ కోసమే ఇస్మార్ట్ శంకర్ ని రూపొందించారు. ఇక ఈ సినిమా కథనంలో గ్రిప్ తగ్గినా రామ్ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్, పూరి మార్క్ క్యారెక్టరైజేషన్ కొంతవరకూ ఫ్లాప్ భారీ నుంచి తప్పించాయి. ఇస్మార్ట్ శంకర్ పై రివ్యూవర్స్ నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఇది జస్ట్ యావరేజ్ సినిమా. బీ-సీ సెంటర్స్ లో మాత్రమే ఆడే సినిమా అంటూ రివ్యూలు రాశారు. అయితే మొదటి రోజు.. ఫస్ట్ వీకెండ్ ఓపెనింగ్స్ పరంగా ఇస్మార్ట్ శంకర్ కి బాగా కలిసి వచ్చింది. ఫస్ట్ రెండు రోజులు ప్రేక్షకులతో సహా ఇండస్ట్రీ వర్గాలెవరూ ఊహించనంత కలెక్షన్స్ వస్తూ ఆశ్చర్య పరుస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: