సినీ దర్శకుడు, నిర్మాత రాంగోపాల్ వర్మ అని చెప్తే అస్సలు బాగోదు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటేనే నాకు బాగుంటుంది అన్నట్టు ఉంటాడు రాంగోపాల్ వర్మ. ఈ మధ్యనే అతను మారిపోయాడు, ఎవరిని విమర్శించట్లేదు, ఎవరితో గొడవ పడట్లేదు.. రాంగోపాల్ వర్మ మంచోడు అయ్యాడు అని రాసిన వారికీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. 


ఇన్నాళ్లు సైలెంట్ ఉన్న వర్మ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. తన శిష్యుడు పూరి జగన్నాధ్ సినిమా హిట్ అవ్వడంతో రాంగోపాల్ వర్మ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. సక్సెస్ పార్టీ అంటూ వెళ్లి అక్కడా బిరాభిషేకం చేసుకొని అల్లరల్లరి చేశాడు. మళ్ళి ఆ సినిమాని చుడానికి బైక్ పైన ట్రిపుల్ రైడింగ్ చేసి సైబరాబాద్ పోలీసులకు 'ఎం పోలీసులు మీరు ?' అంటూ ట్విట్ చేసి రెచ్చగట్టాడు. 


దీంతో పోలీసులు రాంగోపాల్ వర్మ తిక్క కుదర్చనికి అతను ట్రిపుల్ రైడ్ వాహనానికి రూ. 1300 రూపాయలు జరిమానా విధించారు. ఆ 1300 జరిమానాని విధించినట్టు సైబరాబాద్ ట్విట్టర్ ఖాతాలో షేర్ కూడా చేశారు. 'ట్రిపుల్ రైడింగ్ చేసి ట్రాఫిక్ ఉల్లంఘనలను మా దృష్టికి తీసుకొచ్చినందుకు రామ్ గోపాల్ వర్మకి థాంక్స్. మీరు వ్యక్తిగతంగా కూడా అంతే బాధ్యతతో ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకో విషయం. ధియేటర్లలోనే ఎందుకు? బయట ఇలాంటి డ్రామాలు సర్కర్ రోడ్డు మీద నిమిషానికొకటి చూస్తుంటాం'. అని ట్విట్ చేశారు.


ఇప్పటికే పార్టీ జోష్ లో ఉన్న రాంగోపాల్ వర్మ పోలీసులు అని భయం కూడా లేకుండా ఆ ట్విట్ కి స్పందిస్తూ 'సైబరాబాద్ పోలీసు గారు, ఐ లవ్ యు.. మిమ్మల్ని 39 రోజుల పాటు వదలకుండా ముద్దులు పెట్టాలని ఉంది, నాకు రెండో కూతురు ఉంటె కచ్చితంగా మీకు ఇచ్చి, మిమ్మల్ని అల్లుడుని చేసుకునే వాడిని అంటూ ట్విట్ చేశాడు'. ఏదిఏమైనప్పటికీ ఈరోజు ట్విట్టర్ ని ఆగమాగం చేసాడని నెటిజన్లు కామెంట్లతో ట్విట్ బాక్స్ ని బద్దలు కొడుతున్నారు. కాగా సినిమాలో రామ్ 'ఇస్మార్ట్ శంకర్' అయితే రియాలిటీలో రాంగోపాల్ వర్మ 'ఇస్మార్ట్ శంకర్' అని అంటున్నారు నెటిజన్లు.     


మరింత సమాచారం తెలుసుకోండి: