జగన్ సర్కార్ ఏర్పాటు అయ్యాక కీలక పదవుల మీద అందరి కన్నూ పడింది. సినీ రంగం నుంచి వైసీపీకి మంచి మద్దతు లభించింది. పెద్ద తలకాయలు పార్టీ వైపు కన్నెత్తి చూడకపోయినా మిగిలిన వారు మాత్రం జగన్ని బాహాటంగానే సపోర్ట్ చేశారు. దాంతో జగన్ తనకు సహకరించిన వారందరికీ పదవులు పంపిణీ చేసే కార్యక్రం చేపట్టారు.


సినిమా పరిశ్రమకు సంబంధించి అతి కీలకమైన పదవి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పదవి. ఈ పదవి కోసం జగన్ సినీ రంగం నుంచి కొన్ని పేర్లు సెలెక్ట్ చేసుకున్నారని, చివరికి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో జయసుధ, జీవితలను రేసులో ఉంచారని తెలుస్తోంది. ఈ ఇద్దరూ జగన్ కి కావాల్సిన వారే. జయసుధని రాజకీయాల్లోకి తీసుకువచ్చిందే వైఎస్సార్. 


ఇక జీవిత జగన్  పార్టీ పెడితే  వైసీపీలో మొదట్లో చేరి మళ్ళీ వెనక్కు వెళ్లిపోయారు. ఇపుడు కొత్తగా మళ్ళీ వచ్చి  చేరారు. అయినా జగన్ పట్ల విశ్వాసంతో ఉంటున్నారు. ఆమెకు వ్యవహార దక్షత బాగా ఉంది. దీంతో ఈ ఇద్దరిలో ఒకరికి కీలకమైన ఈ చైర్మన్ గిరీని కట్టబెట్టాలని జగన్ ఆలోచిస్తున్నారుట. రేపో మాపో ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: