సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొన్నాళ్ళకు సినీ తారలు రిచ్ ఏరియాలలో ఇల్లు కొనుక్కుంటుంటారు. సినీరంగంలో దాదాపు 15 సంవత్సరాల క్రితం వచ్చిన తమన్నా ఇటీవలే ముంబైలో ఇల్లు కొన్నది. తాప్సి కూడా సొంతంగా ఇల్లు కొనుక్కుంది. ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ కూడా సొంతంగా జుహులో ఇల్లు కొనుగోలు చేసింది.
మొన్నటి వరకు తన పేరెంట్స్ కలిసి ఉన్న అలియా.. ఇప్పుడు సొంతంగా కొనుక్కుంది. ఈ విషయాన్ని అలియా తన అఫీషియల్ యూట్యూబ్ పేజీలో పోస్ట్ చేసింది. పేరెంట్స్ తో కలిసి ఉన్నాను.. ఇప్పుడు సొంతంగా ఇల్లు కొనుకున్నా.. తన చెల్లితో కలిసి ఈ ఇంట్లో ఉండబోతున్నా అని చెప్పింది.
ఇంటికి కావాల్సిన అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేసింది. తన చెల్లి ఇంటికి సంబంధించిన అన్ని విషయాలు చూసుకుంటుందట. కావాల్సిన అన్ని ఇంటీరియర్స్ ను సెలక్ట్ చేసుకున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ లో ఇప్పటికే చాలా సినిమాలు చేసింది.
ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా సీత పాత్రలో నటిస్తున్నది. త్వరలోనే ఈ హీరోయిన్ సెట్స్ లో జాయిన్ అవుతుందట. అటు బాలీవుడ్ బ్రహ్మాస్త్ర సినిమాను చేస్తున్నది.