ఈ కాలంలో ట్విట్టర్ ని ఫాలో అవుతే చాలు సినీ విషయాలైన, రాజకీయ విషయాలైన ప్రజలకు ఈజీగా అర్ధం అయిపోతాయి. ఈ నేపథ్యంలోనే రోజు రోజుకు ట్విట్టర్ ఖాతాలు ఎక్కవ అవుతున్నాయి. ఆనందం అయినా, గొడవ అయినా, బాధ అయినా, విమర్శ అయినా అన్ని ట్విట్టర్ లోనే అంటున్నారు రాజకీయ నాయకులు, సినీ తారలు.


ఈ నేపథ్యంలోనే మొన్న ఆదివారం ట్విట్టర్ వేధికగా కేశినేని నాని, బుద్ధా వెంకన్న ట్విట్ల యుద్ధం చేసుకొని 40 ఏళ్ళ చరిత్ర ఉన్న చంద్రబాబుని ఇరకాటంలోకి నెట్టేస్తే, ఈరోజు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేధికగా 'ఇస్మార్ట్ శంకర్' సినిమా పబ్లిసిటీ కోసం 'నాకు రెండో కూతురు ఉంటె నిన్ను అల్లుడిని చేసుకునే వాడిని' అంటూ పోలీసులతోనే ఆడుకుంటున్నాడు.   


ఒకప్పుడు ఒక సినిమా వస్తుంది అని ప్రేక్షకులకు తెలియడానికి కొన్ని 'లక్షలు ఖర్చు చేసి పబ్లిసిటీ  చేసేవాళ్ళు' ఇప్పుడు చేతిలో ఫోన్ అందులో రూ.399 ఇంటర్నెట్ ప్యాక్ ఉంటె చాలు ఒక్క ట్విట్ తో పబ్లిసిటీ అవుతుంది. ఒక్క రాత్రిలో స్టార్ సెలబ్రెటీ అయిపోవచ్చు. ఒక్క వ్యాఖ్యతో వివాదాలు తెచ్చుకోవచ్చు, ఒక్క ట్విట్ తో జైల్లోనూ కూర్చోవచ్చు, ఒక్క ట్విట్ తో ఆకాశంలో ఉన్నవాడు పాతాళంలోకి పడిపోవచ్చు... అది ట్విట్ పవర్.. అందుకే ఖర్చులేని పబ్లిసిటీ అయినా ఈసారి నుంచి ట్విట్ చేసే ముందు ఎవరైనా సరే జర జాగ్రత్త.      


మరింత సమాచారం తెలుసుకోండి: