బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ ఆలియా భట్‌. వెటరన్ డైరక్టర్ మహేశ్ భట్ కూతురే అయినా తన స్వశక్తితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఎన్నో ఆడిషన్స్‌ లో పాల్గొన్న తర్వాతే తనకు సినిమా అవకాశాలు వచ్చినట్టు ఓ ఇంటర్వూలో ఆలియానే చెప్పింది. చక్కటి అభినయం, గ్లామర్ తో ఎంతోమంది అభిమానులును సంపాదించుకుని బాలీవుడ్ లో అగ్ర తారగా కొనసాగుతోంది.


ఇటీవలే ఈ భామ ముంబయిలోని జూహూలో కొత్త ఇల్లు కొనుక్కొంది. ఇప్పటివరకూ అమ్మానాన్నలతో కలిసి ఉన్న ఆమె కొన్ని రోజుల క్రితం కొత్త ఇంట్లోకి షిఫ్ట్‌ అయ్యింది. ఈ సందర్భంగా తీసిన వీడియోను ఆమె తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన ఇంట్లోని ఫర్నీచర్ ను, ఇంటి అందాన్ని చూపిస్తూ చేసిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఆలియా.. ‘అమ్మానాన్నలు ఉండే ఇంటి నుంచి బయటికి రావడం స్పెషల్‌గా ఉంది. ఎందుకంటే.. నేను నా సొంత ఇంటికి వచ్చా. నేను సినిమాలకి వెళ్తూ తోడుగా నా సోదరిని కూడా తీసుకెళ్తుంటా. తను నాతో ఉండేందుకూ ఇష్టపడుతుంది. అందుకే నాతో కొన్ని రోజులు, అమ్మానాన్నలతో కొన్ని రోజులు ఉండాలని నిర్ణయించుకుంది’ అని చెప్పింది.


ప్రస్తుతం ఆలియా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్.ఆర్‌’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం కాబోతుంది. రామ్ చరణ్ కు జోడీగా నటించబోతోంది. ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభమైంది.దీంతోపాటు ఆమె ‘బ్రహ్మాస్త్ర’, ‘సడక్‌ 2’ సినిమాల్లో నటిస్తొంది. తెలుగు హిట్‌ మూవీ ‘ఓ బేబీ’ హిందీ రీమేక్‌లో ఆమె నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: