జట్టు ఉన్నమ్మ ఏ కొప్పు వేసినా అందంగానే ఉంటుందని సామెత.. పర్ ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేసే సెక్సీ హీరోయిన్ సన్నీలియోన్ కు కూడా ఇదే నానుడి వర్తిస్తుంది. శృంగార రాణిగా ఫ్యాన్స్ జేజేలు అందుకుంటున్న ఈ అమ్మడు ఏ అవతారం ఎత్తినా అభిమానులు సంబరపడుతూనే ఉంటారు.


తాజాగా ఈ ముద్దుగుమ్మ కొత్త అవతారం ఎత్తింది. కల్పిత పాత్ర అయిన సాగర కన్యగా దర్శనమిస్తోంది. సాగర కన్యగా అలంకరించుకుని తీసుకున్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.


ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాగర కన్యగా కనపించడం ఎంతో బావుందని సన్నీలియోన్ కామెంట్ పెట్టింది. గతంలో మరో ఫిట్ నెస్ భామ శిల్పాశెట్టి ఓ సినిమాలో సాగర కన్యగా తెలుగు ప్రేక్షకులను అలరించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: