విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా తెలుగు సినిమాల్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ సినిమా రన్ టైమ్ దాదాపు 3 గంటల 6 నిమిషాల పాటు ఉంటుంది. అర్జున్ రెడ్డి సినిమాకు ముందు అంత రన్ టైమ్ మంచిది కాదనే మాటలు సినిమా ఇండస్ట్రీ నుండి వినిపించాయి. కానీ సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండటంతో అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్టైంది. సినిమా ఆకట్టుకునేలా తీస్తే రన్ టైమ్ ఎక్కువున్నా సమస్య ఉండదని నిరూపించింది అర్జున్ రెడ్డి సినిమా. 
 
ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా రన్ టైమ్ దాదాపు 2 గంటల 50 నిమిషాల దాకా ఉంటుందట. కానీ సినిమా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో మేకర్స్ ఈ నిడివితోనే సినిమా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. అర్జున్ రెడ్డి సినిమా నిడివి ఎక్కువున్నా సక్సెస్ అవ్వటంతో ఆ సెంటిమెంట్ కూడా కలిసొస్తుందని హీరో, దర్శకుడు భావిస్తున్నారట. 
 
మరో వారం రోజుల్లో విడుదల కాబోతుంది డియర్ కామ్రేడ్ సినిమా. గీతా గోవిందం సినిమాతో మంచి జోడీగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తూ ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి తరహా సీరియస్ క్యారక్టర్లో నటిస్తుండగా, రష్మికా మందన్నా లిల్లీ అనే పాత్రలో నటిస్తుంది. భరత్ కమ్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జులై 26న డియర్ కామ్రేడ్ సినిమా విడుదల కాబోతుంది 




మరింత సమాచారం తెలుసుకోండి: