కానీ మహేష్ హిట్స్ తీసే దర్శకులతోనే సినిమాలు చేస్తాడని, ఈసారి అతను చేస్తానని వచ్చినా కానీ తాను చేయనని, ఎందుకంటే తనకి క్యారెక్టర్ వుందని నోరు జారాడు. నిజంగా పూరి అంత గొప్పగా ఫామ్లోకి వచ్చేసాడా? ఇస్మార్ట్ శంకర్ని చూసి తను తీసిన సినిమా అంటూ గర్వపడవచ్చా? అది అతని ఇష్టం. కానీ ఈ సినిమా వరకు కమర్షియల్ సక్సెస్ మినహా దర్శకుడిగా అతని ఖ్యాతిని పెంచేదేమీ కాదనేది సత్యం.
ఈ సినిమా చూసి స్టార్ హీరోలు తనకోసం క్యూ కట్టేస్తారనుకోవడం కూడా అవివేకం. ఇకపోతే ఈ సక్సెస్ పేరు చెప్పి పూరి టీమ్ హద్దులు మీరి అతి చేస్తున్నారు. ఛార్మి అసలు ఆనందం పట్టలేకపోతోంటే మరోసారి వర్మ 'కేవ్'లో చేరిపోయాడు. వర్మ రంగంలోకి దిగాక ఆ అతి ఎలాగుంటుందనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పూరికి హిట్ వచ్చిందని ఆనందపడే అతని అభిమానులు కూడా ఈ సైడ్ బ్యాచ్ చేస్తోన్న అతిని చూసి తిట్టుకుంటున్నారు.