అనేక ఆరోపణలు అనేక వివాదాలు కోర్టు కేసుల మధ్య ‘బిగ్ బాస్ 3’ షోకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈరోజు రాత్రి 9గంటల నుండి ప్రారంభం కాబోతున్న ఈషోకు ఇప్పటి వరకు ఏటెలివిజన్ షోకు రానంత ప్రాముఖ్యత ఏర్పడింది. దీనికికారణం ‘బిగ్ బాస్’ హౌస్ మేట్స్ ఎంపికలో అనేక ఘోరాలు జరిగాయి అంటూ మీడియా ఎదుట శ్వేతా రెడ్డి గాయిత్రి గుప్తాలు తీవ్రఆరోపణలు చేయడమే కాకుండా వారి ఆరోపణలకు అనేక ఋజువులు సాక్షాలు చూపెట్టారు. వీరి ఆరోపణలకు మహిళా సంఘాలు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధుల మద్దతు కూడ లభించడంతో ఈవిషయం ఒక పెను సమస్యగా మారింది. 

దీనికితోడు ఈషోను హోస్ట్ చేస్తున్న నాగార్జునను కూడ ఇరుకున పెడుతూ కొందరు కామెంట్స్ చేయడంతో సాధారణంగా ఇలాంటి పెద్ద షోల ముందు నిర్వహించే మీడియా సమావేశాన్ని కూడ నిర్వహించడానికి నాగార్జున భయపడ్డాడు అంటే ఈషో పై కొన్ని వర్గాలలో వ్యతిరేకత ఎలా ఉందో అర్ధం అవుతుంది. దీనితో ఈషోను నిర్వహిస్తున్న నాగార్జునకు పెను సవాల్ మొదలైంది. 

ఈషో పై పడిన మరకలను చెరిపి ఇది పూర్తిగా అందరూ చూడతగ్గ ఒక ఫ్యామిలీ షో అన్న అభిప్రాయం కలగచేయడానికి నాగ్ తన తెలివితేటలు చాల ఉపయోగించాలి. ఈవిషయంలో నాగార్జున విజయం సాధించలేకపోతే ‘బిగ్ బాస్’ సీజన్ కు సంబంధించి ఇదే ఆఖరి షో అయినా ఆశ్చర్యంలేదు. దీనికితోడు ఈవివాదాల మధ్య ఈషోలో పాల్గొనడానికి భవిష్యత్ లో ఏ సెలెబ్రెటీ సాహసం చేయడు అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి. ఈ షోలో 15 మంది సెలెబ్రెటీలు పాల్గొంటున్నా ఈషోకు సంబంధించి హైలెట్ గా మాత్రం యాంకర్ శ్రీముఖి నటి హేమా హీరో వరుణ్ సందేశ్ అతడి భార్య వితిక టివి9 క్రైమ్ రిపోర్టర్ జాఫర్ లు కనిపించబోతున్నారు. 

‘బిగ్ బాస్’ షో చరిత్రలో నిజ జీవితంలో భార్య భర్తలు అయిన వరుణ్ సందేశ్ వితిక జంటగా ఈషోలో పాల్గొనబోతూ ఉండటం ఒక సంచలనం. ఈషోకు సంబంధించి మొదటి సీజన్ లో శివ బాలాజీ విజేత అయితే రెండవ సీజన్ కు విజేతగా కౌశల్ మారడానికి సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. ఈసారి ఈ సీజన్ విజేతను నిశ్చయించడంలో సోషల్ మీడియాలో వచ్చే సెటైర్లు కామెంట్స్ తట్టుకుని ఈషోను నాగ్ ఎంతవరకు రక్తి కట్టిస్తాడు అన్నది సామాన్యమైన విషయం కాదు. మూడు దశాబ్దాల కాలంగా హీరోగా ఎన్నడూ ఎదుర్కొని సవాల్ నేడు నాగార్జున ‘బిగ్ బాస్ 3’ హోస్ట్ గా ఎదుర్కొబోతున్నాడు. మరి బుల్లితెర ప్రేక్షకులు నాగార్జున సమర్ధత పై ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: