మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ సీజన్ 3 స్టార్ మా ఛానెళ్ళో ప్రసారం కాబోతుంది. ఈ కార్యక్రమానికి నాగార్జున హోస్ట్ గా కనిపించబోతున్నారు. ఈ షోలో వరుణ్ సందేశ్, వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు, నటి హిమజ, తీన్మార్ సావిత్రి, యాంకర్ శ్రీముఖి, క్యారక్టర్ ఆర్టిస్ట్ హేమ, టీవీ9 యాంకర్ జాఫర్, ఉయ్యాల జంపాల ఫేమ్ పునర్నవి భూపాళం, బాబా మాస్టర్, టీవీ యాక్టర్స్ రవికృష్ణ, అలీ రేజా, భరణి, కమెడియన్ మహేశ్ విట్టా, నటి రోహిణి, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది. 
 
బిగ్ బాస్ 2లో జరిగిన తప్పులు మరలా జరగకుండా బిగ్ బాస్ యాజమాన్యం ఈసారి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 2 సమయంలో ఓటింగ్ సిస్టమ్ పై చాలా విమర్శలొచ్చాయి. ఆ విమర్శలు సీజన్ 3లో రాకుండా ఓటింగ్ విధానం మార్చారని సమాచారం . గతంలో గూగుల్ ఓటింగ్ సిస్టమ్ స్టార్ మా ఫాలో అయింది. ఈ సారి మాత్రం ఫోన్ లైన్ ద్వారా మాత్రమే ఓటింగ్ సిస్టమ్ చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ఈరోజు షోలో అధికారికంగా స్పష్టత రానుంది. 
 
బిగ్ బాస్ సీజన్ 3కు ప్రస్తుతానికి కోర్టు నుండి ఊరట లభించినా ఈ షోపై వివాదాలు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే యాంకర్ శ్వేతా రెడ్డి, గాయత్రీ గుప్తా ఈ షోపై సంచలన ఆరోపణలు చేయగా నటి మాధవీ లత బిగ్ బాస్ షో ఇంటర్వ్యూకు వెళ్ళినపుడు మీరు బిగ్ బాస్ హౌస్ లో ఎవరితోనైనా లవ్ లో పడితే ఏం చేస్తారని ప్రశ్నించారని వెళ్ళకముందే అలాంటి ప్రశ్నలకు సమాధానం ఎలా చెబుతానని అన్నారు.బిగ్ బాస్ షో ప్రారంభం కాకముందే ఇన్ని వివాదాలు జరుగుతుంటే ప్రారంభమయ్యాక ఇంకెన్ని వివాదాలు వస్తాయో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: