భానుమతి అనగానే ఫిదా సినిమాలో సాయి పల్లవి అనుకుంటారేమో అక్కడే తప్పు చేస్తున్నారు.  సాయి పల్లవి క్యారెక్టర్ పేరు భానుమతి. భానుమతి ఇప్పటి తరం పిల్లలకు పెద్దగా తెలియదు.  కానీ, అప్పటి వాళ్లకు బాగా తెలుసు.  ఆమె నటన, కంఠం అందరికి సుపరిచితమే.  సినిమా నటించడమే కాకుండా పాటలు పడింది.  


దర్శకత్వం కూడా చేసింది.  తన మూడో సినిమా ధర్మపత్ని సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  ధర్మపత్ని షూటింగ్ జరుగుతుండగా.. అందులో ఓ డైలాగ్ ఉన్నది.  అలా చెప్పమాకండి అని.  


ఆ డైలాగ్ ను దర్శకుడు చెప్పినట్టుగానే అలాగే చెప్పింది.  వెంటనే షూటింగ్ స్పాట్ లో ఓ మూలగా కూర్చొని ఉన్న వ్యక్తి లేచి.. ఆ డైలాగ్ రాసింది ఎవరు అన్నారట.  దీంతో యూనిట్ అంతా షాక్ అయ్యింది.  ఎవరామాట అంది అని.  తీరా చూస్తే ఆయన వెంకట సుబ్బయ్య.  భానుమతి తండ్రిగారు.  


సినిమాను తెలుగులోని అన్ని ప్రాంతాల వారు చూస్తారు.  అలా చెప్పమాకండి అంటే అందరికి అర్ధం కావు.  అలా చెప్పకు అనే చెప్పడంతో అలాగే అని ఓ పొడుగాటి వ్యక్తి దానిని కరెక్షన్ చేశారు.  ఆయనే నాగిరెడ్డి తో కలిసి విజయా సంస్థను నిర్మించిన చక్రపాణిగారు.  అప్పట్లో కరెక్షన్ ఎవరు చెప్పిన సహేతుకంగా ఉంది అంటే మార్పులు చేసేవారు.


మరింత సమాచారం తెలుసుకోండి: