ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్స్ బయ్యర్లకు మంచి జోష్ ను ఇచ్చాయి. విడుదలయిన మూడో రోజే బ్రేక్ ఈవెన్ రావటం గొప్ప విషయం. దర్శకుడు పూరి జగన్నాధ్ ను, ఆయన మిత్ర బృందాన్ని ఆనందాల్లో ముంచెత్తిన సినిమా. హీరో రామ్ఫుల్ హైపర్ యాక్టివ్ గా నటించాడని ప్రశంసలు తెచ్చిన సినిమా. ఇప్పుడు ఈ సినిమా ఎంత చేస్తుంది? ఎంత లాభాలు లాంటి లెక్కలు, అంకెలు వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఓ విషయం వుంది. రామ్ సినిమాల్లో ఇంత అతి తక్కువ రేట్లకు అమ్మిన సినిమా ఇదే అనుకోవాలి.


ఇప్పటిదాకా రామ్ సినిమాలు అన్నీ 25 నుంచి 30-32 కోట్ల రేంజ్ లో థియేటర్ రేట్లు అమ్మిన సినిమాలే. కానీ ఈ సినిమా మాత్రం అంతాకలిపి మహా అయితే 15 కోట్ల లోపునే థియేటర్ హక్కులు క్లోజ్ అయిపోయాయి. రామ్ ప్రస్తుతం వున్న మిడ్ రేంజ్ హీరోల సినిమాలు అన్నీ ఒక్క ఆంధ్రనే 8 నుంచి 10 కోట్ల వరకు అమ్ముడుపోతున్నాయి. నాని, శర్వా, విజయ్, చైతన్య, ఇలా అందరి సినిమాలు ఆంధ్ర 8-10 కోట్ల రేంజ్ లో వుంటున్నాయి. రామ్ సినిమాను మాత్రం అయిదున్నర కోట్ల రేంజ్ లో ఇవ్వాల్సి వచ్చింది.


రామ్ గత సినిమాలు ఏవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఫేర్ చేయలేకపోవడం, దర్శకుడు పూరి ట్రాక్ రికార్డు సరిగ్గా లేకపోవడంతో ఇలా చేయాల్సి వచ్చింది. వాస్తవానికి నిర్మాత చార్మి ఈ సినిమాకు కనీసం 20 కోట్లకు పైగా థియేటర్ హక్కులు వస్తాయని భావించారు. ఆ రేట్ కే ఇవ్వాలనుకున్నారు. కానీ బయ్యర్లు రాకపోవడం, అన్నివైపుల నుంచి వత్తిడి, అన్నీకలిసి సినిమాను తక్కువకే ఇచ్చేయాల్సి వచ్చింది. అలా చేయడమే మంచిది అయింది. అలాకాకుండా ఆంధ్ర-నైజాం-సీడెడ్ కలిపి ఇరవై కోట్లకు అటుగా ఇచ్చివుంటే, ఇప్పుడు వినవస్తున్న, కనవస్తున్న జోష్ వుండేదికాదు. ఆంధ్ర అయిదున్నర కోట్ల రేషియో కాబట్టి, మూడో రోజుకు బయ్యర్లు సేఫ్ అయిపోయి, సూపర్ సినిమా దొరికింది అన్న ఆనందం మిగులుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: