కొన్నేళ్లనుండి టాలీవుడ్ సినిమా పరిశ్రమలో నెంబర్ వన్ హీరో ఎవరు అనే చర్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. నిజానికి ఒకప్పుడు ఎన్టీఆర్ గారు తెలుగు సినిమా పరిశ్రమను నెంబర్ వన్ హీరోగా కొన్నేళ్ల పాటు ఏలిన తరువాత, సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా కొన్నాళ్ళు నెంబర్ వన్ మాస్ హీరోగా కొనసాగడం జరిగింది. అయితే ఆపై మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ కి తిరుగులేని హీరోగా ఎన్నో ఏళ్ళు  కొనసాగారు. ఇక చిరంజీవి మెల్లగా సినిమాలు తగ్గించి రాజకీయరంగ ప్రవేశం తరువాత టాలీవుడ్ కి నెంబర్ వన్ హీరో ఎవరు అనే దానిపై ఇప్పటికీ సరైన స్పష్టత రావడం లేదు. 

అయితే ఆ విషయంలో ముందుగా చెప్పుకోవలసింది మాత్రం సూపర్ స్టార్ మహేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల గురించే. ఎందుకంటే వీరిద్దరి సినిమాలు కనుక సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటే వారి సినిమాలకు వచ్చే కలెక్షన్లు కూడా భారీగానే ఉంటాయి. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో వీరిద్దరి సినిమాలు కనుక సూపర్ డూపర్ హిట్ టాక్ ను సంపాదిస్తే, వాటికి వచ్చే కలెక్షన్ రూ.150 నుండి రూ.200 కోట్లవరకు ఉండే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇక బాహుబలి రెండు భాగాల సూపర్ సక్సెస్ ల తరువాత ప్రభాస్ ఇండియాలోనే టాప్ సూపర్ స్టార్స్ లో ఒకరిగా ఎదిగిపోయారు. ఇక ప్రస్తుతం ఆయన మార్కెట్ ఒక బాలీవుడ్ స్టార్ హీరో మార్కెట్ తో సమానంగా ఉంది. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలని అదేమిటంటే, బాహుబలి సినిమాను మినహాయిస్తే ప్రభాస్ కు అంతకముందు రూ.45 కోట్ల షేర్ మార్క్ సినిమాగా మిర్చి మాత్రమే ఉందని, 

అయితే బాహుబలి విజయాల్లో ప్రభాస్ తో పాటు రాజమౌళి క్రెడిట్ కూడా చాలావరకు ఉండడంతో ప్రభాస్ ను ఈ రేస్ లో నిలపలేము అనేది కొందరి వాదన. ఇక జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటివారి సినిమాలు సూపర్ హిట్ అయితే అద్భుతమైన కలెక్షన్లు రాబడుతున్నప్పటికీ అవి మహేష్, పవన్ సినిమాలకు వచ్చే కలెక్షన్ ను అందుకోవడం కొంత కష్టం అనేది విశ్లేషకులు చెప్తున్న మాట. మరి పవన్ ఇటీవల రాజకీయాల్లో చేరి పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పడం జరిగింది. ఇక మహేష్ బాబు చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. మరి ఇప్పటికీ ప్రశ్నర్ధకంగా మారిన టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరు అనే సందిగ్ధంశం పై ఎప్పటికి సరైన సమాధానం దొరుకుతుందో కాలమే సమాధానం చెప్పాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: