శ్రీనిక క్రియేటివ్ వర్క్స్ నిర్మాణంలో శ్రీ పవార్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం “2 అవర్స్ లవ్”. కృతి కార్గ్ అనే కొత్త హీరోయిన్ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఇప్పటివరకు తెలుగు తెరపై చాలా ప్రేమ కథలు వచ్చాయి. సరికొత్త కథాంశంతో “2 అవర్స్ లవ్” అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ట్రైలర్ ను శనివారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా విడుదల చేసారు.

 

ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ, 2 అవర్స్ లవ్ అంటే రెండు గంటల పాటు ప్రేక్షకులను ప్రేమలో ఉంచే సినిమా అని అనుకుంటూన్నాను. హీరోగా చేస్తూ దర్శకత్వం చేయడం అనేది అంత సులభం కాదు. శ్రీ పవార్ ని ఈ విషయంలో మెచ్చుకుని తీరాల్సిందే. అతను ఎంత బాగా చేశాడో ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మంచి కంటెంట్ తో సినిమా రూపొందిందని అర్థమవుతుంది అని అన్నారు.


అలాగే తన దృష్టిలో పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు ఉండవని మంచి కంటెంట్ ఉండి దాన్ని సరిగ్గా తీయగలిగితే ఏ సినిమా అయినా ఆడుతుందని అన్నారు. అటువంటి సినిమాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారని అన్నారు. చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాట్లాడుతూ, నిర్మాతగా నేను చేస్తున్న మొదటి చిత్రం కావడంతో యూనిట్ అందరం బాగా కష్టపడ్డాం. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నామని అన్నారు.

 

ఇక హీరో కమ్ దర్శకుడు మాట్లాడుతూ, సినిమాలంటే చిన్నప్పటి నుండి ఆసక్తి. ముఖ్యంగా దర్శకత్వం గురించి ఎక్కువగా ఆలోచించే వాడిని. నన్ను దర్శకత్వం వైపు వచ్చేలా ఇన్ స్పైర్ చేసింది సుకుమార్ గారు. ఆయన చేసిన సినిమాలంటే నాకెంతో ఇష్టం. కాబట్టి మా “2 అవర్స్ లవ్” చిత్రాన్ని సుకుమార్ గారికి అంకితం ఇస్తున్నాం అని అన్నారు. అలాగే ట్రైలర్ విడుదలకు వచ్చిన రాజ్ కందుకూరి గారికి దన్యవాదాలు తెలియజేసాడు.

 



మరింత సమాచారం తెలుసుకోండి: