ఇటీవల ఖైదీ నెంబర్ 150 సినిమాతో సినిమాల్లోకి రి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో మంచి జోష్ తో తన తదుపరి సినిమా సైరా నరసింహారెడ్డిని మొదలెట్టడం జరిగింది. ఇక కొద్దిరోజుల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందట. ఇకపోతే దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలున్నాయని అంటున్నారు. 

తొలిసారి మెగాస్టార్ ఒక స్వతంత్ర సమరయోధును పాత్రలో నటించడం ఒక ప్రత్యేకత అయితే, నరసింహారెడ్డి గారి పాత్రలో మెగాస్టార్ పలికే డైలాగులు మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో అయన నటన అదరహో అనిపించేలా ఉంటుందట. ఇక నేడు ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త పలు మీడియా మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.  అదేమిటంటే, ఈ సైరా సినిమాలో మెగాస్టార్ ఇంట్రడక్షన్ సీన్ మరియు ప్రీ క్లైమాక్స్ సీన్లు థియేటర్లో ఆడియన్స్ కు ఎంతో నచ్చుతాయని, ఇక ఆ సీన్లకు థియేటర్ కు వచ్చిన మెగాఫ్యాన్స్ కు అయితే పూనకాలు రావడం ఖాయం అని అంటున్నారు. 

ఎంతో కష్టపడి దర్శకుడు సురేందర్ రెడ్డి సహా అయన టీమ్ మొత్తం ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం శ్రమించారని, రేపు సినిమా విడుదల తరువాత వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరుకుతుందని సినిమా యూనిట్ కూడా ధీమా వ్యక్తం చేస్తోందట. మరి ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని ఒకవేళ ప్రస్తుతం విరివిగా ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం మెగా ఫ్యాన్స్ కు ఇది పండుగ వార్తే అని చెప్పవచ్చు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: