ఇటీవల టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పేరుతో అమ్మాయిలకు సినిమా అవకాశాలు ఇప్పిస్తామని,  మరీ ముఖ్యంగా మన తెలుగు అమ్మాయిలను అవకాశాల పేరుతో లైంగికంగా కోందరు మేనేజర్లు, కో ఆర్డినేటర్లు వారిని లొంగతీసుకుంటున్నారని వర్ధమాన నటి శ్రీరెడ్డి పెను సంచంలయానికి తెరతీసిన విషయం తెలిసిందే. అంతేకాక ఏకంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసిన శ్రీరెడ్డి, ఆ తరువాత వారి నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో నెమ్మదించింది. ఆపై పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి, అయన అభిమానుల తీవ్ర గురైన సంఘటన ఎప్పటికీ మరిచిపోలేనిది. 

ఇక గత కొద్దిరోజులుగా తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సినిమా ప్రముఖులపై సెటైర్లు వేస్తున్న శ్రీరెడ్డి, పూర్తిగా తన మకాంని చెన్నై కి మార్చుకుంది. ఇకపోతే నేటి నుండి స్టార్ మా ఛానల్ లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 3 షోలో ఆమె కూడా ఒక కంటెస్టెంట్ గా పాల్గొంటోంది అంటూ ఇటీవల వార్తలు రావడం జరిగింది. అంతేకాక కొన్ని మీడియా మాధ్యమాల్లో ఆమె పాల్గొనడం నిజమే అంటూ అప్పట్లో వార్తలు ఊదరగోట్టాయి కూడా. ఇక నిజానికి మొదట్లో ఆమె కూడా తనకు బిగ్ బాస్ టీమ్ నుండి తన సెలక్షన్స్ కోసం ఫోన్ వస్తుందని భావించారట. అయితే అటువంటిది ఏమి జరగకపోవడంతో శ్రీరెడ్డి పూర్తి నిరాశపడ్డారని సమాచారం. 

ఆమె సన్నిహితులు కూడా ఆమెకు బిగ్ బాస్ న్యూ సీజన్ లో పాల్గొనే అవకాశం వస్తుందని ఎంతో ఆశపడ్డారట. ఇక అటువంటిది ఏమి జరగకపోవడంతో ఇది ఒకరకంగా శ్రీరెడ్డికి పెద్ద షాకే అని అంటున్నారు. అయితే ఈవిషయంలో మరికొందరి వాదన వేరేలా ఉంది, వారు చెప్తున్న ప్రకారం, శ్రీరెడ్డికి బిగ్ బాస్ టీమ్ నుండి ఆహ్వానం వచ్చినప్పటికీ, అయిష్టతతోనే ఆమె షోలో పాల్గొనలేను అని వారికి తేల్చి చెప్పారట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే స్వయంగా శ్రీరెడ్డి నోరు విప్పాల్సిందే.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: