తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 పై వరుసగా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.  బిగ్ బాస్ 1,2 ప్రశాంతంగా జరిగినా బిగ్ బాస్ 3 మాత్రం మొదటి నుంచి ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంది.  ఆ మద్య బిగ్ బాస్ 3 కి ఎవరు హూస్ట్ గా ఉండబోతున్నారన్న విషయంపై రక రకాల వార్తలు వచ్చాయి.  ఇక బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్తున్న కంటెస్టెంట్లపై రక రకాల వార్తలు వస్తున్నాయి.  ఇది కాదన్నట్లు ప్రస్తుతం బిగ్ బాస్ యాజమాన్యం మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిందని యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా పోలీస్ కేసులు పెట్టిన విషయం తెలిసిందే.  దాంతో అసలు బిగ్ బాస్ షో ఈ రోజు వస్తుందా రాదా అన్న విషయంపై కూడా ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. 

మరోవైపు బిగ్ బాస్ లోకి నటి హేమ వెళ్తుందని వార్తలు వస్తున్నాయి.  ఈ మద్య హేమ బిగ్ బాస్ పై మాట్లాడుతూ ఏ ఇబ్బంది వచ్చినా అప్పుడే స్పందించాలి తమను తీసుకోలేదనే అక్కసు తో ఇలా ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదని ఆమె అన్నారు. అయితే హేమ గురించి శ్వేతారెడ్డి మాట్లాడుతూ.. ఆమె లాగా బిగ్‌బాస్ షోకి వెళ్ళాలనే కక్కుర్తి తనకు లేదన్నారు.

కమిట్మెంట్‌లు, అగ్రిమెంట్‌లు మీకు పరిపాటి అయ్యుండొచ్చని ఆమె వ్యాఖ్యానించారు.బిగ్‌బాస్ షోతో బలైన మహిళలు బయటికి వచ్చి మాట్లాడాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. సోషల్ ఆక్టివిస్ట్‌లు, రాజకీయపార్టీలు అంతా తనకు సపోర్ట్ చేయాలని శ్వేతారెడ్డి కోరారు.నాకు జరిగిన ఈ అన్యాయంపై జాతీయ మీడియా కూడా సపోర్ట్ చేస్తోంది. స్టార్ గ్రూప్ కూడా స్పందించింది. స్టార్ ఇండియా గ్రూప్ ఇంటర్నల్ కమిటీ ఈ వివాదంపై దర్యాప్తు చేస్తోందని శ్వేతారెడ్డి తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: