చంద్రబాబునాయుడు అంటే నిరంతరం రాజకీయాల్లో మునిగితేలే రకం అనుకుంటారు. ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కూడా అలాగే ఉంటుంది. మిగిలిన వారిలా బాబుకు వేరే వ్యాపకాలు, అభిరుచులు  తక్కువ అంటారు. అసలు రాజకీయం కాకుండా మీకు ఏది ఇష్టం అని బాబుని అడిగితే బహుశా ఆయన కూడా జవాబు చెప్పలేరేమో


అటువంటి చంద్రబాబు ఇపుడు టాలీవుడు టాలీవుడ్ ప్రముఖ గాయని, ఇండియన్ పాప్ సింగర్  స్మితకు గ్రీట్ చేశారంటే ఓ విధంగా షాక్ లాంటి పరిణామమే. స్మిత ఇండస్ట్రీలొ  అడుగుపెట్టి నేటితో ఇరవై ఏళ్లు పూర్తయ్యాయి. 20 ఇయర్స్ ఇండస్ట్రీ పూర్తయిన సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్మితకు అభినందనలు తెలిపారు. తాజా టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. స్మితకు అభినందనలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.


నటి, గాయని స్మిత తన పాటలతో సంగీత ప్రియులకు అద్భుతంగా ఆహ్లాదం కలిగిస్తున్నందుకు అభినందలు తెలియజేశారు. తెలుగులో ప్రసిద్ధి చెందిన గాయని, నర్తకిగా గుర్తింపు పొందిన స్మిత వల్లూరుపల్లి తెలుగులో మొట్టమొదటి పాప్ ఆల్బమ్ రూపొందించడం గర్వకారణమన్నారు. నిజంగా ఇది అద్భుతమైన ప్రశంసే. దానో స్మిత ఉబ్బి తబ్బిబ్బయ్యారు.  ట్విట్టర్ వేదికగా స్మిత కూడా  రియాక్ట్ అయ్యారు.


 ‘ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే సందర్భం. నాకు విష్ చేసిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు’ అని బాబుకు ట్యాగ్ చేశారు. మొత్తానికి రాజకీయాల్లో బిజీ బిజీగా ఉంటున్న చంద్రబాబు స్మితను గ్రీట్ చేయడం పట్ల అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: