అక్కినేని నాగార్జున స్పీడ్ చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. ఈరోజు నుంచి ప్రారంభం కాబోతున్న ‘బిగ్ బాస్’ షోను హోస్ట్ చేస్తూనే ఆగష్టు 9న విడుదల కాబోతున్న తన ‘మన్మధుడు 2’ ప్రమోషన్ విషయంలో నాగ్ అనుసరిస్తున్న వ్యూహాలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి.
లేటెస్ట్ గా ఈమూవీ ప్రమోషన్ కు సంబంధించి దాదాపు ఎడున్నర నిముషాలు ఉన్న ఒక వీడియోను విడుదల చేసారు. ఈ ప్రాంక్ వీడియో కాలేజీలలో ఒక సీనియర్ జూనియర్ ను ర్యాగింగ్ చేసిన తరహాలో ఉంది. వీడియో ప్రారంభంలో నాగ్ రాహుల్ కు ఫోన్ చేస్తాడు. ఆ సమయంలో రాహుల్ కమెడియన్ వెన్నెల కిషోర్ తో కలిసి డబ్బింగ్ స్టూడియోలో 'మన్మథుడు 2' డబ్బింగ్ వర్క్స్ లో బిజీగా ఉంటాడు.
అయితే రాహుల్ ను సరదాగా ఏడిపించాలని నిశ్చయించుకున్న నాగార్జున తనకు పోర్చుగల్ ఫుడ్ ఐటమ్ తినాలని ఉందని అంటాడు. పోర్చుగల్ లో చాలా రోజులు షూట్ చేశాము కదా అక్కడ ఒక డిష్ ను రెగ్యులర్ గా తిన్నాం. అది నాకు ఇప్పుడు తినాలని ఉంది అంటూ ఆ ఐటమ్ ను తనకు తెచ్చి పెట్టమని నాగార్జున రాహుల్ రవీంద్రన్ కు ఆర్డర్ వేస్తాడు.
రాహుల్ ఆ హోటల్ కు వెళ్ళిన తర్వాత బ్లూటూత్ లో నాగ్ అతడికి సూచనలు ఇస్తూ ఇలా చెయ్ అలా చెయ్ అంటూ పిచ్చిపిచ్చి పనులు రాహుల్ తో చేయిస్తాడు. ఒక కస్టమర్ తాగుతున్న డ్రింక్ ను లాక్కోమని ఒక లేడీ దగ్గరకు వెళ్లి "ఐ డోంట్ ఫాల్ ఇన్ లవ్.. ఐ ఓన్లీ మేక్ లవ్" అంటూ ఆమెకు చెప్పమని నాగార్జున రాహుల్ కు తెగ టార్చర్ పెడతాడు. ఈవిషయాలు అన్నీ రాహుల్ నాగ్ చెప్పినట్లుగా చేసినా అక్కడ రెస్టా రెంట్ లోని వ్యక్తులు అర్ధం చేసుకోలేక పోవడంతో చిన్నపాటి గొడవ ఏర్పడితే రాహుల్ నవ్వుతూ ఇది అంతా ‘మన్మధుడు 2’ ప్రమోషన్ కోసం చేసిన సందడి అంటూ చెప్పి అందర్నీ నవ్విస్తాడు. దీనితో ఆ రెస్టారెంట్ కు వచ్చిన చాలామంది ఇలా కూడ మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారా అంటూ ఆశ్చర్య పోయినట్లు టాక్..