ఇండస్ట్రీలో హీరోగా స్టార్ట్ స్టేటస్ తెచ్చుకోవడం అంటే అంత ఈజీ పనేం కాదు. స్టార్ వారసులుగా అవకాశాన్ని తెచ్చుకున్నా ఆ తర్వాత వారి సొంత టాలెంట్ మీదనే ఛాన్సులు వస్తాయి. తెలుగు పరిశ్రమలో ఓ స్టార్ తనయుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదట్లో తన జోష్ ఫుల్ యాక్టింగ్ తో అదరగొట్టిన యువ హీరో పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది.


సక్సెస్ ట్రాక్ లో లేడు.. భార్య కూడా తనని వదిలేసి వెళ్లడంతో సదరు హీరో చాలా డిప్రెషన్ లోకి వెళ్లాడట. సినిమాలు తీయాలా వద్దా.. కెరియర్ ఎటువైపు అన్న ఆలోచనతో రోజులు గడుపుతున్నాడట. కొన్నాళ్లు అమెరికాలో గడిపిన ఈ హీరో ప్రస్తుతం ఇక్కడే ఉన్నాడు. అయితే ఆ హీరో భవిష్యత్తు మాత్రం అగమ్యగోచరంగా ఉందని తెలుస్తుంది.    


సినిమాలు చేస్తూ మళ్లీ పోయిన క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉన్నా ఈమధ్య కాస్త బొద్దుగా మారడంతో పెద్దగా అవకాశాలు రావట్లేదట. మరి స్టార్ తనయుడిగా ఈ హీరో ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడని అంటున్నారు. స్నేహితులతో కూడా పెద్దగా కలవట్లేదని తెలుస్తుంది. ఏది ఏమైనా ఆ హీరో మళ్లీ సినిమాలు చేసి హిట్ ట్రాక్ ఎక్కాలని ఆశిస్తున్నారు ఆయన ఫ్యాన్స్.  


ఫ్యాన్స్ కోరిక మన్నించి మిగతా ఆలోచనలన్ని పక్కన పెట్టి సదరు హీరో సినిమాలు చేస్తే బెటర్. అయితే ఈ హీరో కెరియర్ కూడా సక్సెస్ లో లేకపోవడం వల్ల మరింత డిప్రెషన్ కు వెళ్లాడని తెలుస్తుంది. మరి ఈ హీరో నెక్స్ట్ ప్లానింగ్ ఏంటో తెలియాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: