ఎఫ్ 2 సినిమా విజయం తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ చేస్తున్న సినిమా " వాల్మీకి". తమిళంలో విజయం సాధించిన "జిగర్తాండ" సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ప్రస్తుతం వరుణ్ తేజ్ ఈ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఎప్పటికప్పుడు చిత్ర విశేషాలను సోషల్ మీడియా ద్వారా పంచుకునే వరుణ్ తేజ్ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేసాడు.


సోషల్ మీడియా ఛాలెంజిల గురించి అందరికీ తెలిసిందే. ఎప్పుడు ఏదో ఒక ఛాలెంజ్ వేస్తూనే ఉంటారు. సెలెబ్రిటీలు చేసే ఛాలెంజ్ లు ట్రెండ్ అవుతాయి. కికీ ఛాలెంజ్ అయితేనేమి, ఐస్ బకెట్ ఛాలెంజ్ అయితేనేమి, తాజాగా బాటిల్ క్యాప్ ఛాలెంజ్ ఎంత ట్రెండ్ అయిందో తెలిసిందే. అయితే కికీ ఛాలెంజ్ కానీ, ఐస్ బకెట్ ఛాలెంజ్ వల్ల జనాలకి లాభం ఏమీ ఉండదు. జస్ట్ ఎంటర్ టైన్ మెంట్ట్ తప్ప. పనికొచ్చే వాటిని కూడా ఛాలెంజ్ చేసిన వాళ్ళున్నారు. కానీ అవి అంత ట్రెండ్ అవలేదనే చెప్పాలి.


హైదరాబాదులో నీటి సమస్య అధికంగా ఉంది. దానికి తోడు వర్షాలు కూడా సరిగా పడట్లేదు. భూగర్భ జలాల్లో నీటి శాతం తగ్గిపోతోంది. 1500 అడుగులు బోరు వేస్తే గానీ చుక్క నీరు పడట్లేదు. హైదరాబాద్ నీటి కష్టాలు తీరాలంటే భూగర్భ జలాలు పెరగాలి. అంతే కాకుండా మనం కూడా నీటి వినియోగాన్ని తగ్గించి, నీటిని వృధా కాకుండా చూసుకోవాలి. అప్పుడే మన భవిష్యత్ లో నీటి గురించి యుద్ధాలు జరగకుండా ఆపగలం.


నీటిని వృధా చేయరాదు అనే సదుద్దేశ్యంతో జూలై 21 ఆదివారం రోజున కేవలం ఒకే ఒక్క బకెట్ నీటిని వాడాలని సోషల్ మీడియాలో ఛాలెంజ్ విసురుతున్నారు. ఈ ఛాలెంజిని స్వీకరించిన మెగా హీరో వరుణ్ తేజ్ ఈ రోజు మొత్తం కేవలం ఒక బకెట్ నీళ్ళే వాడతానని చెప్పాడు. అంతే గాక ఈ ఛాలెంజిని స్వీకరించండంటూ కొణిదెల ఉపాసనని, రానా దగ్గుబాటిని, హరీష్ శంకర్ ని ట్యాగ్ చేసాడు. మరి వాళ్ళు ఈ ఛాలెంజిని స్వీకరించి వాళ్ళెవరికి ఛాలెంజి చేయబోతున్నారో చూడాలి.
 



మరింత సమాచారం తెలుసుకోండి: