కమలహాసన్ ముద్దుల కూతురు. గారాల పట్టి శ్రుతిహాసన్. ఆమె కూడా తండ్రి లాగానే మల్టీ టాలెంటెడ్. నటనతో పాటు, సంగీతం, నాట్యం, దర్శకత్వ అభిరుచి ఇలా అన్నీ ఉన్న అమ్మడు. తెలుగులో శ్రుతి కొన్ని మూవీస్ చేసింది కానీ హిట్ రేట్ తక్కువే. అయితే సరిగ్గా ఆమే ఫాం లోకి వచ్చిన టైంలో...


సినిమాలు వదిలేసుకుంది. దీనికి  అప్పట్లో ఆమె లవ్ అఫైర్ కూడా ఓ కారణం. దాంతో శ్రుతి మంచి పీక్ స్టేజ్ లో టాలీవుడ్ కే కాదు, మొత్తం సినిమాలకే దూరంగా కొన్నాళ్ళు ఉండిపోయింది. ఇపుడు లవ్ బ్రేకప్ కావడంతో మళ్ళీ మూవీస్ వైపు శ్రుతి ద్రుష్టి పెట్టింది. అయితే ఈ లోగానే చాలా మార్పులు వచ్చేశాయి.


అంతా కొత్తదనం, కొత్తవాళ్ళు, ఇపుడు శ్రుతికి అచ్చంగా టాలీవుడ్లో అవకాశాలు ఇచ్చేవాళ్ళు తక్కువే. ఇక యంగ్ హీరోలెవరూ శ్రుతి వైపు చూడడంలేదుట. వారికి ఈ అమ్మడు ముదుగు భామలా ఉందిట. దాంతో టాలీవుడ్ లో రీ ఎంట్రీ అంటున్న శ్రుతి వస్తూనే రవితేజా మూవీలో హీరోయిన్ అయిందన్న న్యూస్ వినిపిస్తోంది.


అదే విధంగా మరో సీనియర్ మోస్ట్ హీరో మూవీలో కూడా శ్రుతిని తీసుకుంటారని అంటున్నారు. ఇదే నిజమైతే ఈ ముద్దు గుమ్మ సీనియర్ సిటిజన్ల జాబితాలో చేరినట్లే. శ్రుతి, రాగం అన్నీ తెల్సిన శ్రుతి తన కెరీర్ ని మాత్రం శ్రుతిలో పెట్టుకోకేపోయిందని కామెంట్శ్ వినిపిస్తున్నాయి. అంతే ఒక్క చాన్స్ మిస్ అయితే ఇక అంతే.


మరింత సమాచారం తెలుసుకోండి: