యంగ్ డైనమిక్ హీరో రామ్ మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల కలయికలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్, ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతోంది. పూరి మార్క్ టేకింగ్, స్క్రీన్ ప్లే మరియు హీరో రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్, డాన్స్, అదరగొట్టే ఫైట్స్ అలానే స్వరబ్రహ్మ మణిశర్మ అందించిన వండర్ ఫుల్ మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుందని అంటున్నారు ప్రేక్షకులు మరియు సినీ విశ్లేషకులు. 

వాస్తవానికి పూరి నుండి గతంలో కూడా మంచి సినిమాలు వచ్చినప్పటికీ, అవి ఎందుకో ప్రేక్షకులను అలరించలేకపోయాయని, అయితే ప్రస్తుతం తామందరం ఎంతో కష్టపడి పని చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ప్రేక్షకులు అందిస్తున్న నీరాజనాలకు ఎంతో సంతోషంగా ఉందని సినిమా యూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమా గడిచిన మూడు రోజుల్లో ఏకంగా రూ.36 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ కొల్లగొట్టినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. ఇది హీరో రామ్ కెరీర్ లో బిగ్గెస్ బ్లాక్ బస్టర్ కలెక్షన్ అని, 

ఇక పూరి సినిమాల్లో కూడా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని అంటున్నారు. ఇక ఏ సెంటర్లలో మూడొంతులు పైగా కలెక్షన్ రాబడుతున్న ఈ సినిమా, బి మరియు సి సెంటర్లలో మాత్రం పూర్తి స్థాయి హౌస్ ఫుల్ కలెక్షన్స్ సాధిస్తూ దూసుకెళుతోంది. మరి ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ హవా చూస్తుంటే రాబోయే రోజుల్లో మరింత కలెక్షన్ కొల్లగొట్టి మరిన్ని అద్భుతమైన రికార్డులు నెలకొల్పడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: