రామ్ మరియు పూరీల కలయికలో వచ్చిన లేటెస్ట్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్. గత కొద్దికాలంగా అటు హీరో రామ్ కు, ఇటు దర్శకుడు పూరికి సరైన సక్సెస్ లేకపోవడంతో, ఒక్కసారిగా హిట్ దిశగా సాగుతున్న ఈ సినిమా వారిద్దరితో పాటు ఆ సినిమా యూనిట్ మొత్తానికి మంచి జోష్ ని ఇచ్చిందనే చెప్పాలి. ఇక తమ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు సినిమా యూనిట్, 

అంతేకాదు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రత్యేక అథితిగా నిన్న ఈ సినిమా సక్సెస్ పార్టీని కూడా సినిమా యూనిట్ ఎంతో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది. ఇక ఆ పార్టీలో రామ్ గోపాల్ వర్మ, నటి మరియు నిర్మాతైన ఛార్మి, హీరోయిన్స్ నిధి అగర్వాల్, నభ నటేష్ అలానే దర్శకుడు పూరితో కలిసి విపరీతంగా ఎంజాయ్ చేసారు. ఇక ఆ పార్టీ తాలూకు ఫోటోలు మరియు వీడియోలు నిన్నటినుండి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా చక్కరులు కొడుతున్నాయి కూడా. ఇకపోతే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన నభ నటేష్ పై దర్శకుడు వర్మ పొగడ్తలు కురిపించారు. 

ఆమెను చూస్తుంటే తనకు ఇలియానా గుర్తుకువస్తోందని, ఆమెకు ఏకంగా ఇలియానా 2.0 అనే బిరుదును ఇస్తూ, తన సోషల్ మీడియా మాధ్యమాల్లో నభ తో కలిసి దిగిన ఫోటో ను కాసేపటి క్రితం షేర్ చేసారు వర్మ. టాలీవుడ్ కి సుధీర్ బాబు సరసన నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నభ నటేష్, ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడం, అలానే ప్రస్తుతం రామ్ తో కలిసి చేసిన రెండవ సినిమా ఇస్మార్ట్ శంకర్ కూడా సక్సెస్ కావడంతో అమితానందాన్ని వ్యక్తం చేస్తోంది నభ నటేష్.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: