సూపర్ స్టార్ మహేష్ బాబు హిట్ డైరెక్టర్ ల తోనే  సినిమాలు చేస్తారా?  అంటే పరోక్షంగా అవుననే అంటున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్ . మహేష్ బాబు తో రెండు సూపర్ హిట్ సినిమాలను పూరి రూపొందించాడు . ప్రస్తుతం పూరి జగన్నాధ్ వరుస ప్లాప్ లతో  కెరీర్ డైలమా ఉన్న  దశ లో ఇస్మార్ట్ శంకర్ సినిమా తో మరొక హిట్ ను తన ఖాతా లో వేసుకున్నాడు .


 ఇస్మార్ట్ శంకర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ మహేష్ తో  సినిమాలు చేయమని ఆయన అభిమానులు కోరుతున్నారని కానీ... అభిమానులకు అర్ధం కానిది ఏమిటంటే తాను హిట్ల తో ఉంటేనే  మహేష్ తనతో సినిమాలు చేస్తాడని  చెప్పుకొచ్చాడు పూరి.  జనగణమన సినిమా  మహేష్ తో చేయమని ప్రిన్స్ ఫ్యాన్స్  కోరుతున్నారని అన్నాడు . తనకు మహేష్ కంటే మహేష్ ఫ్యాన్స్ అంటేనే ఎక్కువ ఇష్టమన్నారు .


ఈ విషయాన్నీ వాళ్లకు చాలాసార్లు చెబుదామనుకున్నా ... వాళ్లకు తనపై ఎంతో నమ్మకం ఉందన్నాడు . తాను ప్లాప్ లతో ఉన్న మహేష్ బాబు తో సినిమా చేయాలనీ వారు కోరుకుంటారని చెప్పాడు . ఇస్మార్ట్ శంకర్ చిత్రం  తరువాత మహేష్ తో సినిమా చేస్తారా అన్న ప్రశ్నకు నేను ఒకే చెప్పాడని నాకు ఒక క్యారెక్టర్ ఉండాలి కదా అంటూ పరోక్షంగా మహేష్ తో సినిమా చేయనని చెప్పాడు పూరి జగన్నాధ్ .


మరింత సమాచారం తెలుసుకోండి: