ఇటీవల తెలుగు టెలివిజన్ తెరపై ప్రసారం అయిన బిగ్ బాస్ రెండు సీజన్లు ప్రేక్షకుల అద్భుతమైన ఆదరణ మరియు రేటింగ్స్ తో ముందుకు సాగిన విషయం తెలిసిందే. ఇక మొదటి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, అలానే రెండవ సీజన్ కు నాచురల్ స్టార్ నాని హోస్టులుగా వ్యవహరించి, షోని మరింత సక్సెస్ చేశారనే చెప్పాలి. నిజానికి ఆ రెండు సీజన్ల సమయంలో షో పై చిన్నపాటి విమర్శలు మరియు వివాదాలు వచ్చినప్పటికీ, నేడు ప్రసారం కాబోతున్న సీజన్ 3 పై మాత్రం పలు వివాదాలు మరింత ముదిరి, చివరికి ఎటువంటి పరిస్థితులకు దరిస్తాయో కూడా అర్ధం కాని స్థితికి చేరుకుంటున్నాయని అంటున్నారు విశ్లేషకులు. 

దానికి ప్రధాన కారణం ఇటీవల బిగ్ బాస్ షోలో కాస్టింగ్ కౌచ్ ఉందని, షో నిర్వాహకుల్లోని కొందరు, తమను షోలో పాల్గొనేందుకు లైంగిక కోరిక తీర్చమని కోరుతూ ఇబ్బందులకు గురిచేశారని నటి గాయత్రీ గుప్తా మరియు జర్నలిస్ట్ శ్వేతా రెడ్డిలు కోర్ట్ ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇక వీరి వివాదం ఢిల్లీ స్థాయికి చేరుకోవడం, అలానే బిగ్ బాస్ షో ని పూర్తిగా బ్యాన్ చేయాలని వారు కోరడంతో షో పెద్ద సమస్యల్లో ఇరుక్కుంది. అయితే కోర్ట్ సానుకూల తీర్పుతో షో ప్రసారానికి అడ్డంకులు తొలగిపోయినప్పటికీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగ్ సహా పార్టిసిపెంట్స్ లోని కొందరు లోలోపల ఎంతో మధన పడుతున్నారట. ఇక నాగార్జున అయితే అనవసరంగా ఈ సీజన్ కు తాను హోస్ట్ గా ఉంటానని మాటిచ్చి తప్పుచేసానని తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. 

బిగ్ బాస్ షో పై చిన్నప్పటి వివాదాలున్న విషయం తనకు తెలుసునని, అయితే అవి ముదిరి చివరకు ఇటువంటి పెను సమస్యలకు దారితీస్తాయని తాను భావించలేదని నాగార్జున అన్నారట. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో నిజానిజాలు తెలియనప్పటికీ, ఒకవేళ ఈ వార్తల్లో నిజం ఉంటె మాత్రం, నాగ్ షో పూర్తిగా కొనసాగే వరకు ఉంటారో లేదో చెప్పడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ సడన్ గా నాగ్ కనుక షో నుండి తప్పుకోవడం జరిగితే అది బిగ్ బాస్ టీమ్ కు మరియు ఫ్యాన్స్ కు అది బిగ్ షాకే అనడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. మరి బిగ్ బాస్ విషయంలో మున్ముందు ఏమి జరుగుతుందో వేచి చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: