ఒకానొక సమయంలో ఎవరు ఊహించని హిట్లు కొట్టిన మాస్ మహారాజ రవితేజ...తర్వాత వరుసగా ఫ్లాపులు వచ్చిన సందర్భంలో చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని రాజా ది గ్రేట్ అనే సినిమా చేసి మళ్లీ హిట్ ట్రాక్ అందుకున్నాడు రవితేజ. అయితే తర్వాత మళ్లీ సినిమాలు అన్ని వరుసగా ఫ్లాపులు కావటంతో ఎక్కడా కూడా తగ్గకుండా తన రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకోకుండా సినిమాలు ఒప్పుకొని చేసినా గాని సినిమాలు ఫ్లాప్ అవడంతో బాక్సాఫీస్ దగ్గర తన క్రేజ్ మరియు మార్కెట్ లో తన రేట్ పడిపోవడంతో రవితేజ ఎవ్వరు ఊహించని పని ఇండస్ట్రీలో చేసినట్లు వార్తలు వినపడుతున్నాయి.


ఇక అసలు మేటర్లోకి వెళితే ఇటీవల వరుసగా ప్లాప్ లు వస్తున్న క్రమంలో రెమ్యూనరేషన్ విషయంలో ఎక్కడా కూడా తగ్గలేదు మొన్నటివరకు. ఏదో ఒక సినిమా హిట్ అవుతుంది తన మార్కెట్ డిమాండ్ అలాగే ఉంటుంది అనుకుని రవితేజ చాలా ధీమాగా ఉన్నారు. కానీ సిట్యువేషన్ మరీ బ్యాడ్ అయ్యిపోయింది. నిర్మాతల నుంచి ఫోన్స్ రావటం దేవెడురుగు, తను ఫోన్ చేస్తున్నా ఎత్తే పరిస్దితి లేదు. "అమర్ అక్బర్ ఆంటోనీ" సినిమా తర్వాత రవితేజకు అది స్పష్టంగా అర్దమైంది.


దాంతో ఈ సారి ఎలాగైనా ఓ సెన్సేషన్ హిట్ కొట్టాలనుకున్నాడు. తను హిట్ లో ఉంటే రెమ్యునేషన్ కు లోటేంది. అలా కమిటైందే "మహాసముద్రం" సినిమా. ఆర్ ఎక్స్ 100 డైరక్టర్ తో అయితే తనకు మరో సెన్సేషన్ హిట్ ఖాయమని ఓకే చేసాడు. అందుతున్న సమాచారం మేరకు  ఈ సినిమాకు పారితోషికం తీసుకోవడం లేదు రవితేజ. దీంతో ఇండస్ట్రీ లో ఉన్నవారు అందరూ షాక్ అయిపోయారు. ఈ నేపథ్యంలో సినిమా అయితే లాభం లో షేర్ తీసుకుంటున్నట్లు లేకపోతే అది కూడా తీసుకోకుండా ఉండాలని రవితేజ ఆలోచిస్తున్నట్లు ఫిలింనగర్ టాక్. 

 



మరింత సమాచారం తెలుసుకోండి: