విజయ్ దేవరకొండ తన అభిమానులను ‘రౌడీస్’ అని ముద్దుగా పిలుచుకుంటాడు. ఆ ముద్దు పేరుతో ఏకంగా ఒక బ్రాండ్ కూడ పెట్టి వ్యాపారం చేస్తున్నాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ లేడీ ఫ్యాన్స్ కూడ రౌడీస్ గా మారి విజయ్ దేవరకొండ బౌన్సర్లకు చుక్కలు చూపించిన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 

మొన్న శుక్రు వారం హైదరాబాద్ లో జేఆర్సీ కన్వేషన్ సెంటర్లో ‘డియర్ కామ్రేడ్’ మ్యూజిక్ ఫెస్టివల్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ కు అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు రావడంతో కొంత గందరగోళం ఏర్పడింది. 

ఈ ఈవెంట్ ప్రారంభం కాకముందే విజయ్ ను చూడాలి అన్న ఆతృతతో ఈ ఆడిటోరియం గేటు ముందు అమ్మాయిలు తోసుకుంటూ వచ్చారు. వారిని గేట్ బయట ఆపాలని ప్రయత్నించినా ఏమాత్రం ఆగకపోవడంతో చిన్న సైజు రగడ జరిగింది. విషయం తెలుసుకున్న విజయ్ బౌన్సర్లు రంగంలోకి దిగి సద్దుబాటు చేయాలని ప్రయత్నించినా అమ్మాయిలు అంతా గుంపుగా ఏకంగా బౌన్సర్లను తోసివేస్తూ లోపలకు వెళ్ళి పోవడంతో విజయ్ పెట్టుకున్న బౌన్సర్లు కూడ లేడీ ఫ్యాన్స్ చేసిన హడావిడి చూసి ఏమీ చేయలేక అచేతనంగా ఉండిపోయినట్లు తెలుస్తోంది. 

సాధారణంగా బౌన్సర్లు హీరోల అభిమానుల పై దాడి చేస్తారు. ఇక్కడ రివర్స్ లో లేడీ ఫ్యాన్స్ బౌన్సర్ల పై దాడి చేయడం ఇక్కడి ట్విస్ట్. ఈవారం విడుదల కాబోతున్న ఈమూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కేరళా రాష్ట్రాలలో కూడ విడుదల కాబోతున్న నేపధ్యంలో ఈమూవీకి వచ్చే భారీ ఓపెనింగ్స్ ను బట్టి విజయ్ రేంజ్ మరింత పెరిగే ఆస్కారం ఉంది..    



మరింత సమాచారం తెలుసుకోండి: