పూరి జగన్నాద్ కి చాలా కాలానికి ఒక సినిమా హిట్ వచ్చేసరికి ఆగలేకపోతున్నారు.. అందుకే రోజుకో సినీ స్టార్ పై సంచలన వ్యాఖ్య చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ తో ఒక్క హిట్ కొట్టేసరికి పూరి జగన్నాద్ మాస్ పార్టీ అంటూ రామ్ గోపాల్ వర్మ ముఖ్య అతిథిగా వచ్చి ఆ పార్టీలో ఎంత రచ్చ రచ్చ చేసారో అందరికి తెలిసిందే. 


ఈ నేపథ్యంలోనే ఇస్మార్ట్ శంకర్ సినిమా ప్రేమోషన్స్ భాగంగా కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ కి పూరి జగన్నాద్ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో అతనితో చేసిన సూపర్ స్టార్ పై కామెంట్లు చేశాడు. అందులో మహేష్ బాబుని ఉద్దేశిస్తూ 'నాకు హిట్ ఉంటేనే నాతో సినిమా చెయ్యడానికి వస్తాడు.. లేకుంటే సినిమాలు చెయ్యడానికి రాడు అని కామెంట్లు చేశాడు. ఈ కామెంట్ విన్న ప్రతిఒక్కరు పూరీని విమర్శించారు.


ఇది మరవకముందే మరో ఇంటర్వ్యూలో బాలయ్యపై కామెంట్ చేశాడు. ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్న అడుగుతూ మీరు సినిమా తీద్దాం అంటే ఏ హీరో త్వరగా స్పందిస్తారు అని అడిగారు? 'బాలయ్య చాల మంచి స్టార్.. నేను సినిమా చేద్దాం అంటే ముందు ఉండేది అతనే అని అన్నారు.. ఈ జవాబుకు యాంకర్ మళ్ళి ప్రశ్న వేస్తూ 'బాలయ్య ఫ్యాన్స్ ని ఒకసారి కొట్టారు కదా' దానిపై మీ స్పందన ఏంటి అని అడిగారు. ఫ్యాన్స్ ని కొట్టారు అంటే వాళ్ళు ఏమి చెయ్యకుండా అయన కొట్టాడు. వాళ్ళు అభిమానంతోనే అయన దగ్గరకు వచ్చిన గుంపు గుంపుగా ఆయనపై పడిన సమయంలో అయన కొట్టింటారు' అని వ్యాఖ్యానించారు.      



మరింత సమాచారం తెలుసుకోండి: