ప్రముఖ నిర్మాత సంస్థ గీత ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్, బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ప్రైమ్ ఫోకస్ పతాకంపై నమిత్ మల్హోత్రా సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా రామాయణ్. 1500 కోట్ల బడ్జెట్ తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాని మూడు భాషల్లో మూడు భాగాలుగా నిర్మించనున్నారు.


ఈ సినిమాకు నటీనటుల్ని దేశవ్యాప్తంగా వివిధ భాషా పరిశ్రమల నుంచి ఎంపిక చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో సీత పాత్రకు ఎవరిని ఎంపిక చేసుకున్నారు అనే విషయం ఆసక్తిగా మారింది. దీనిపై సౌత్ కి సంబందించి ఇద్దరి ప్రముఖ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒకరు నయనతార కాగా, మరొకరు అనుష్క. రామరాజ్యం సినిమాలో సీతగా అలరించిన నయనతార ఆ అవకాశం ఇస్తే బాగుంటుందని ఈ సినిమా టీమ్ భావిస్తుంది.


మరోవైపు పలు సినిమాల్లో తన నటనతో అదరగొట్టిన అనుష్క పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ ఇద్దరిలో అల్లు రామాయణంలో సీత పాత్రా ఎవరిదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభమవుతుందని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: