హృదయ కాలేయం అనే చిత్రంతో ప్రేక్షకులను తనదైన శైలిలో అలరించి బర్నింగ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు.తాను నటించిన తాజా చిత్రం కొబ్బరిమట్ట ఆగస్టు రెండున విడుదల కానుంది. ఈ చిత్రానికి దర్శకుడు సాయిరాజేశ్ వహిస్తున్నారు. ఆరెక్స్ 100 ఫేమ్ హీరో కార్తికేయ నటించిన తాజా చిత్రం హిప్పీ.



ఈ చిత్రంలో మన సంపూర్నేష్ బాబు నటించిన కొబ్బరిమట్ట లోని ఒక సన్నివేశాన్ని వాడారు. అదేంటంటే,ధియేటర్ లో కార్తికేయ కొబ్బరిమట్ట లోని ఓ సన్నివేశాన్ని చూస్తూ పగల బడి నవ్వుకుంటూ ఉంటారు. దీనిపై కొబ్బరిమట్ట దర్శకుడు స్పందిస్తూ ట్విట్టర్ లో ఈ విధంగా పోస్ట్ చేశారు."హాయ్ కార్తిక్ మీరు నటించిన హిప్పీ సినిమాలో కొబ్బరిమట్ట చిత్రాన్ని సంపూర్ణేష్ బాబును నన్ను టార్గెట్ చేసిన సన్నివేశాన్ని నేను చూశాను.


నేను దర్శకుణ్ణి ఏమీ తప్పుపట్టను.కాని ఈ సన్నివేశాన్ని రాసిన రచయితకు మరియు నటించిన మీకు ఒక  విష్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇండస్ట్రీలో ఉన్నందుకు మీరు సినిమాను మరియు తోటి నటీనటులను గౌరవించటం నేర్చుకోండి."అని ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.దీనిపై సంపూర్నేష్ బాబు కూడా ఇలా స్పందించారు.


"కార్తికేయ నా మీద వేసిన జోక్ కి పర్వాలేదు నాకు తిట్లు ఏమీ కొత్త కాదు, నేను ఈ స్టేజ్ కి రావటానికి ఎన్నో కష్టాలు పడ్డాను.కానీ, విడుదల కాని మా కొబ్బరిమట్ట చిత్రం మీద మీరు ఇలా తప్పుగా మాట్లాడటం అస్సలు ఏమీ న్యాయం కాదు.మేము ఈ చిత్రాన్ని ఎంతో ప్రేమతో, ఎన్నో కష్టాలు పడి తీశాము" అని ఆయన ఎంతో బాధతో చెప్పారు. అయితే, దీనిపై మన ఆరెక్స్ 100 కార్తికేయ ఎలా స్పందిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: