సాహో సినిమా వాయిదా పడటంతో చాలా సినిమాలు రిలీజ్ డేట్స్ మార్చుకోవాల్సి వచ్చింది. సాహో వాయిదా వలన కొన్ని సినిమాలకు మేలు జరుగుతుంటే మరికొన్ని సినిమాలు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నాయి. సాహో రిలీజ్ డేట్ మారటం వలన మన్మధుడు2, ఎవరు, రణరంగం సినిమాలకు మేలు జరుగుతుంది. ఇదే సమయంలో గ్యాంగ్ లీడర్, వాల్మీకి సినిమాలకు సరైన రిలీజ్ డేట్ దొరకటం కష్టమవుతుంది. సాహో సినిమా రిలీజ్ డేట్ మారటం సైరా సినిమాకు కూడా వార్నింగ్ బెల్ లాంటిదే. 
 
సైరా సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. కానీ సాహో సినిమాలా చివరి నిమిషంలో ఏదో ఒక కారణంతో సైరా రిలీజ్ డేట్ మారిస్తే మాత్రం సైరాకు అంతకంటే మంచి డేట్ దొరకటం కష్టం. సాహో లాగే సైరా సినిమాను కూడా భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు చిత్ర నిర్మాతలు. తెలుగులో మాత్రమే కాకుండా వివిధ భాషల్లో సైరా సినిమాను విడుదల చేస్తున్నారు. సైరా సినిమాలో గ్రాఫిక్స్ కు సంబంధించిన సన్నివేశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. 
 
కాబట్టి సైరా సినిమా రిలీజ్ డేట్ కంటే ముందుగానే అన్ని పనులు పూర్తి చేసుకోవాల్సి ఉంది. సైరా సినిమాలో చిరంజీవి, నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రతో సైరా సినిమా రూపొందుతుంది. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: