సెలబ్రెటీ హోదా సమాజంలో చాలా బావుంటుంది. లక్షల మంది మనవైపే ఆరాధనగా చూస్తుంటారు. మనం ఏం చేసినా అదో వార్త అవుతుంది. అంతవరకూ ఓకే.. కానీ అదే సెలబ్రెటీ ఓ లేడీ అయితే.. అందులోనూ ఆమె సెక్సీగా ఉంటే.. ?


లేడీ సెలబ్రెటీల విషయంలో ఇలాంటి ఇబ్బందులు తప్పడం లేదు. ఇందుకు ఉదాహరణ.. యాంకర్ అనసూయ.. ఇప్పుడు తెలుగులో మాంచి ఫాలోయింగ్ ఉన్న యాంకర్. ఉత్త యాంకరే కాదు.. వెండితెరపై నటిగానూ మంచి మార్కులే కొట్టేస్తోంది.


నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా హుషారుగా ఉంటే ఈ అమ్మడికి ఫ్యాన్స్ కూడా ఎక్కువే. కానీ కొందరు పోకిరిగాళ్లు అనసూయ పేరుతో సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు సృష్టిస్తున్నారు. వాటిలో అసభ్యకరమైన రాతలు రాస్తున్నారు.


దీంతో యాంకర్ అనసూయపై అసభ్యరాతలు రాస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రోగ్రెసివ్ యూత్ నాయకులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాంకర్ అనసూయ పేరుతో సోషల్ మీడియాలో కుప్పలుతెప్పలుగా ఖాతాలు తెరిచి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: