రామ్ గోపాల్ వర్మ గురించి అందరికి తెలిసిందే.  సినిమా హిట్ ఫట్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతాడు.  అంతేకాదు తన శిష్యుల సినిమాలను ఆయనకంటే ఎవరు ఎక్కవ ప్రమోషన్ చేయరు.  శిష్యుడి సినిమా కోసం చేసే ప్రమోషన్స్ అలాఇలా ఉండవు.  


ఆర్ఎక్స్ 100 విషయంలో కూడా అలానే చేశారు.  ఇప్పుడు పూరి విషయంలో అంతకు మించి అనేలా చేసి శభాష్ అనిపించుకున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  సినిమా రిలీజ్ తరువాత రామ్ హాలిడే వెకేషన్ కు వెళ్లారు.  


అయన లేకుండానే ఇక్కడ పార్టీలు హడావుడి జరిగిపోతున్నది.  చాలాకాలం తరువాత పూరి హిట్ అందుకోవడంతో వర్మ తగహడావుడి చేస్తున్నాడు.  అయన పిచ్చి ఎంతలా ఉందంటే.. ఏకంగా రజినీకాంత్ సినిమాను తీసుకొని ఆయనపై సెటైర్ వేసేలా ఓ వీడియో ను రూపొందించాడు.  


రజిని చంద్రముఖి సినిమాలోని క్లైమాక్స్ సీన్ తీసుకొని దానికి వర్మ బీర్ పార్టీ వీడియోను యాడ్ చేసి రిలీజ్ చేశాడు.  ఇది సరదాకే కావొచ్చు.  దీన్ని చూసిన రజిని అభిమానులు వర్మపై పిచ్చ కోపంతో ఉంటారు అనడంలో సందేహం అవసరం లేదు.  వర్మకు కూడా కావాల్సింది అదే కదా.  ఎప్పుడు ఏదో ఒక రగడ లేకుండా అస్సలు ఉండలేడు.  ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: