అవతలి వ్యక్తులకు ఏవైనా చెప్పేటప్పుడు మనం కూడా  కొద్దిగా ఆలోచించాలి.  అరె వాళ్లకు చెప్తున్నాం కదా మనం వాటిని పాటిస్తామా లేదా... ఒకవేళ మనం వాటిని పాటించలేని పక్షంలో ఏం చేయాలి.  ఎలా మనల్ని మనం రక్షించుకోవాలి అని ఆలోచించాలి.  అవేమి పట్టనట్టు వాళ్లకు నీతులు చెప్పాం అయిపొయింది.  నాపని చేసు చేసుకుంటా అంటే కుదరదు.  


ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే.. అక్కడికే వస్తున్నా.. బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గతేడాది ఓ మెసేజ్ ను ఇచ్చింది.  దీపావళి సమయంలో టపాసులు కాల్చకండి.. వాతావరణం కాలుష్యం అవుతుంది.  అసలే నాకు ఆస్తమా ఉన్నది.. నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పి మెసేజ్ చేసింది.  


టపాసులు కాల్చొద్దు.. పర్యావరణం పాడౌతుంది అనడం వరకు బాగానే ఉంది.  నాకు ఆస్తమా ఉన్నది పొగ పడదు అని చెప్పిన ఈ అమ్మడు.. ఇప్పుడు ఏం చేసిందో చూశారా.  స్టైల్ గా  భర్త నిక్ జోనస్ తో కలిసి సిగరెట్ కాలుస్తోంది.  దానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది. 


ఇలా సోషల్ మీడియాలో పోస్టయిన ఈ ఫోటో వైరల్ గా మారింది.  దీనిపై అనేక కామెంట్లు వస్తున్నాయి.  ఆస్తమా ఉందంటూ ఇలా పొగతాగడం ఏంటి అని నెటిజన్లు విమర్శిస్తున్నారు.  అనుసరించడం చేతగానప్పుడు చెప్పడం దేనికి అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: