బాలకృష్ణ టాప్ హీరో అందులో సందేహం లేదు.  ఒకసారి ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు అంటే దర్శకుడు చెప్పింది చెప్పినట్టుగా చేయడమే ఆయన పని.  అలా కాదు ఇలా అని అస్సలు వేలు పెట్టరు.  చెప్పించి చెప్పినట్టు చేసుకుంటూ పోతారు.  అందుకే బాలయ్యను దర్శకుడి హీరో అంటారు.  


తన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు అలాగే చేస్తుంటాడు. సినిమా సీన్స్ లో ఎంతగా ఇన్వాల్వ్ అవుతారంటే.. దానికి ఓ ఉదాహరణ రౌడీ ఇన్స్పెక్టర్ సినిమానే అని చెప్పాలి.  అందులో బాలయ్య ఇన్స్పెక్టర్ గా నటించారు.  పోలీస్ డ్రెస్, జీప్ బాగా అలవాటయ్యాయి.  


షూటింగ్ కు వచ్చిన దగ్గరి నుంచి ఆయన అదే డ్రెస్ లో ఉండేవారు.  సీన్ మారితే తప్పించి అలానే ఎక్కువ కనిపించారట.  ఓ రోజు బాలయ్య ఫోన్ చేసి షూటింగ్ కు రావడం లేదని చెప్పారట.  దీంతో పాపం బి గోపాల్ షాక్ అయ్యాడు.  ఎందుకు రావడం లేదని ఆరాతీస్తే.. 


తన జీప్ రాలేదని అన్నారట.  రోజు షూటింగ్ సమయంలో బాలయ్య పోలీస్ జీప్ లో షూటింగ్ కు వచ్చేవారు.  పోలీస్ జీప్ దిగి పోలీస్ లా లాఠీ పట్టుకొని వచ్చేవారు.  అలా షూటింగ్ కు వచ్చే బాలయ్యకు ఆరోజు జీప్ అందుబాటులో లేకపోవడంతో షూటింగ్ కు రానన్నారట. వెంటనే యూనిట్ పోలీస్ జీప్ ను బాలయ్య ఇంటికి పంపడంతో షూటింగ్ కు వచ్చారు.  అది బాలయ్య నిబద్ధత అంటే.  


మరింత సమాచారం తెలుసుకోండి: